16వ విడత పీఎం కిసాన్ పథకం డబ్బులు విడుదలయ్యేది ఎప్పుడో తెలుసా ?

దేశవ్యాప్తంగా రైతులకు ఆర్థిక మద్దతు అందించేందుకు కేంద్రం పీఎం కిసాన్ పథకం ప్రవేశపెట్టింది.

Update: 2023-12-09 11:53 GMT

దిశ, వెబ్​డెస్క్​ : దేశవ్యాప్తంగా రైతులకు ఆర్థిక మద్దతు అందించేందుకు కేంద్రం పీఎం కిసాన్ పథకం ప్రవేశపెట్టింది. దీని కింద అర్హులైన అన్నదాతలకు ప్రతి సంవత్సరం 3 విడతల్లో రూ. 6 వేలు అందిస్తుంది. దీనిని ప్రతి 4 నెలలకు ఒకసారి రైతుల అకౌంట్లలో వేస్తారు. ఇటీవల 15వ విడత డబ్బులు కూడా రైతులకు అందించింది. ఇప్పటివరకు రైతులకు రూ. 30 వేల వరకు ఖాతాల్లో వేసినట్టు తెలిసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ 16వ విడత డబ్బులు కూడా పడనున్నాయి. కాగా 15వ విడత డబ్బులు చాలా మంది అకౌంట్లలో పడలేదు. రైతులు కేవైసీ అప్​ డేట్​ చేసుకుంటే డబ్బులు పడే అవకాశం ఉంది. అప్పటికీ పడకపోతే సమీప మండల వ్యవసాయ అధికారుల వద్దకు వెళ్తే పూర్తి వివరాలు వారు చెబుతారు.   


Similar News