రైతులకు అవగాహన సదస్సు

తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో బుధవారం ఏఈఓ ఉమారాణి ఆధ్వర్యంలో రైతులకు వరి నేరుగా విత్తడంపై రైతు పొలాల్లో

Update: 2023-04-12 11:49 GMT

దిశ,ఎం తుర్కపల్లి : తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో బుధవారం ఏఈఓ ఉమారాణి ఆధ్వర్యంలో రైతులకు వరి నేరుగా విత్తడంపై రైతు పొలాల్లో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వరిలో వెలుజలే పద్ధతి వలన కూలీల కొరతను అధిగమించి పెట్టుబడి తగ్గించవచ్చునని అన్నారు. ఎకరానికి 4.5 వేల రూపాయలను ఆదా చేయవచ్చని అన్నారు .విత్తనాలు ఎకరానికి 10 నుండి 15 కిలోల తగ్గించవచ్చానన్నారు .పద్ధతిలో నారు పెంపకం లేనందువలన పంట కాలం ఏడు నుంచి పది రోజులు తగ్గుతుందన్నారు. విత్తనాలు నేరుగా చల్లడం వలన పిలకల సంఖ్య పెరిగి 10 నుంచి 15% దిగుబడి పెరుగుతుందన్నారు. డ్రం సీడర్ పద్ధతిలో వరి నాట్లు వేయాలని సూచించారు. వరి కంపోస్ట్ లాంటి సేంద్రియ పద్ధతులు ఉపయోగించి ఎరువులు తగ్గించాలని కోరారు. మరియు యూరియా , పొటాష్ ఎరువులను ఒకేసారి కాకుండా దపా దపాలు గా వాడుకోవాలని సూచించారు. ఈ పద్ధతుల పాటించి రైతులు అధిక లాభాలు పొందవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు పోగుల రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.


Similar News