గోదారి ఉగ్రరూపం.. ఏజెన్సీల్లో ముంపు భయం

దిశ, కుక్కునూరు : భారీ వర్షాల కారణంగా గోదావరి నీటిమట్టం పెరగడంతో పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు, వేలేరుపాడు మండలాలను వరద నీరు చుట్టుముట్టింది. పలు వంతనెలపై వరద నీరు పారడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వేలేరుపాడులో ఎద్దువాగు, వసంతవాడ వాగు, కుక్కునూరు మండలంలో గుండేటివాగుల్లోకి గోదావరి ఉధృతి పెరిగింది. సుమారు 40 పైగా గ్రామాలకు రాకపోకలు స్తంభించి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. కాగా కరెంట్ స్తంభాలు నీటమునిగాయి. ఈ ఏడాదిలో గోదావరి మూడోసారి పెరగడంతో ఏజెన్సీ ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. […]

Update: 2021-09-09 02:26 GMT

దిశ, కుక్కునూరు : భారీ వర్షాల కారణంగా గోదావరి నీటిమట్టం పెరగడంతో పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు, వేలేరుపాడు మండలాలను వరద నీరు చుట్టుముట్టింది. పలు వంతనెలపై వరద నీరు పారడంతో రాకపోకలు నిలిచిపోయాయి.

వేలేరుపాడులో ఎద్దువాగు, వసంతవాడ వాగు, కుక్కునూరు మండలంలో గుండేటివాగుల్లోకి గోదావరి ఉధృతి పెరిగింది. సుమారు 40 పైగా గ్రామాలకు రాకపోకలు స్తంభించి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. కాగా కరెంట్ స్తంభాలు నీటమునిగాయి. ఈ ఏడాదిలో గోదావరి మూడోసారి పెరగడంతో ఏజెన్సీ ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. కాగా గురువారం రాత్రికి గోదావరి నీటి ప్రవాహం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.

 

Tags:    

Similar News