కాళేశ్వరానికే మళ్లీ ఫుల్ నిధులు..
దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ఈసారి భారీ నీటి పారుదలకు కేటాయింపులు ఏకంగా 30 శాతం పెంచింది. గత ఆర్థిక సంవత్సరం 2019-20 సవరించిన అంచనాల ప్రకారం ప్రభుత్వం నీటిపారుదల శాఖకు రూ. 8476 కోట్లు కేటాయించగా, ఆ అంచనాల మీద 30 శాతం నిధులు పెంచి 2020-21 ఆర్థిక సంవత్సరంలో శాఖపై పెట్టబోయే వ్యయం రూ.11043కోట్లుగా తెలిపింది. ఈ మొత్తంలో నిర్వహణ వ్యయం 7250 కోట్లుగా చూపారు. మిగతా 2750 కోట్లు ప్రగతి పద్దు కింద […]
దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ఈసారి భారీ నీటి పారుదలకు కేటాయింపులు ఏకంగా 30 శాతం పెంచింది. గత ఆర్థిక సంవత్సరం 2019-20 సవరించిన అంచనాల ప్రకారం ప్రభుత్వం నీటిపారుదల శాఖకు రూ. 8476 కోట్లు కేటాయించగా, ఆ అంచనాల మీద 30 శాతం నిధులు పెంచి 2020-21 ఆర్థిక సంవత్సరంలో శాఖపై పెట్టబోయే వ్యయం రూ.11043కోట్లుగా తెలిపింది. ఈ మొత్తంలో నిర్వహణ వ్యయం 7250 కోట్లుగా చూపారు. మిగతా 2750 కోట్లు ప్రగతి పద్దు కింద చూపారు. వీటిలో రాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిపై ప్రతిష్టాత్మకంగా చేపట్టి దాదాపు పూర్తి చేసిన కాళేశ్వరం ప్రాజెక్టకు ఈసారి రూ.6759 కోట్లు కేటాయించారు. ఈ మొత్తంలో కాళేశ్వరం కార్పొరేషన్‌కు లోను కింద రూ.5300 కోట్లు కేటాయించారు. ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం కోసం రూ.732 కోట్లు ఇచ్చారు. డ్యాం, కెనాల్‌ల నిర్మాణాలకు వరుసగా 520కో్ట్లు, 1 64 కోట్లు కేటాయించారు. ఇక దక్షిణ తెలంగాణలో కృష్ణా నదిపై నిర్మిస్తున్న మరో ప్రధాన ప్రాజెక్టైన పాలమూరు ఎత్తిపోతల పథకాని పెట్టుబడి వ్యయం కింద రూ.752 కోట్లు ఇచ్చారు. ఈ మొత్తంలో రూ.344కోట్లు డ్యాం నిర్మాణానికి, రూ.20 కోట్లు కాలువల నిర్మాణానికి, రూ.368 కోట్లు పునరారవాస ప్యాకేజి కింద కేటాయించారు. ఇక గోదావరి నదిపైనే ఖమ్మం జిల్లాలో నిర్మిస్తున్న మరో భారీ ప్రాజెక్టైన సీతారామ ఎత్తిపోతల పథకానికి ఈ ఏడాది పెట్టుబడి కింద రూ.910 కోట్లు కేటాయించారు. వరంగల్ జిల్లాలో గోదావరి నదిపై నిర్మిస్తున్న మరో ప్రధాన ప్రాజెక్టైన చొక్కారావు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్‌కు రూ. 219 కోట్లు కేటాయించారు. కంతనపల్లి ప్రాజెక్టకు ఈ ఏడాది రూ.168 కోట్లు కేటాయించారు. కాగా, చిన్న నీటిపారుదలకు మొత్తంగా రూ.400 కోట్లు కేటాయించారు.
tags: telangana budget, kaleshwaram, irrigation fund