స్వరాష్ట్రానికి 1600మంది కూలీలు
దిశ, మహబూబ్ నగర్ : సుమారు 1600 మంది వలస కూలీలు స్వరాష్ట్రానికి బయలుదేరి వెళ్లారు.శనివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం నుంచి వలస కార్మికులను వారి సొంత రాష్ట్రాలకు పంపించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.ముందుగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పనిచేసే దాదాపు పదహారు వందల మంది ఒరిస్సాకు బయలు దేరారు.జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ వరకు ప్రైవేటు బస్సులు, ఇతర వాహనాల్లో కూలీలను తీసుకొచ్చి ప్రత్యేక రైలు ఎక్కించేందుకు పోలీసు యంత్రాంగం, […]
దిశ, మహబూబ్ నగర్ :
సుమారు 1600 మంది వలస కూలీలు స్వరాష్ట్రానికి బయలుదేరి వెళ్లారు.శనివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం నుంచి వలస కార్మికులను వారి సొంత రాష్ట్రాలకు పంపించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.ముందుగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పనిచేసే దాదాపు పదహారు వందల మంది ఒరిస్సాకు బయలు దేరారు.జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ వరకు ప్రైవేటు బస్సులు, ఇతర వాహనాల్లో కూలీలను తీసుకొచ్చి ప్రత్యేక రైలు ఎక్కించేందుకు పోలీసు యంత్రాంగం, అధికారులు అన్నిచర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ముందుగా వారికి థర్మల్ స్క్రీనింగ్ చేసి అనంతరం ప్రత్యేక రైళ్ల ద్వారా సొంతూళ్లకు పంపించనున్నట్టు సమాచారం.తమను సురక్షితంగా సొంత రాష్ట్రానికి పంపిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి వలస కూలీలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.