షాకింగ్ : PIZZA డెలివరీ బాయ్‌గా మారిన ఆప్ఘనిస్తాన్ మాజీ మంత్రి.. (పిక్స్ వైరల్)

దిశ, వెబ్‌డెస్క్ : ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకోవడం ప్రపంచానికి పెనువిపత్తుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మేధావులు హెచ్చరిస్తున్న తరుణంలో అక్కడి ప్రజల ఆర్తనాదాలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. అయితే, ఒకప్పుడు ఆ దేశ మంత్రిగా కొనసాగిన వ్యక్తి ప్రస్తుతం జర్మనీలో ‘పిజ్జా డెలివరీ బాయ్‌’గా పనిచేస్తుండటం అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. అందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వివరాల్లోకి వెళితే.. ఆఫ్ఘనిస్తాన్‌ మాజీ మంత్రి ‘సయ్యద్ అహ్మద్ షా సాదత్’ జర్మనీలో ‘పిజ్జా […]

Update: 2021-08-25 08:49 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకోవడం ప్రపంచానికి పెనువిపత్తుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మేధావులు హెచ్చరిస్తున్న తరుణంలో అక్కడి ప్రజల ఆర్తనాదాలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. అయితే, ఒకప్పుడు ఆ దేశ మంత్రిగా కొనసాగిన వ్యక్తి ప్రస్తుతం జర్మనీలో ‘పిజ్జా డెలివరీ బాయ్‌’గా పనిచేస్తుండటం అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. అందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

వివరాల్లోకి వెళితే.. ఆఫ్ఘనిస్తాన్‌ మాజీ మంత్రి ‘సయ్యద్ అహ్మద్ షా సాదత్’ జర్మనీలో ‘పిజ్జా డెలివరీ వ్యక్తి’గా పనిచేస్తున్నారు. గతంలో ఆయన ‘కమ్యూనికేషన్ మరియు టెక్నాలజీ’ మంత్రిగా పనిచేశారు. అయితే, సైకిల్‌పై పిజ్జా డెలివరీ చేస్తున్న సాదత్ ఫోటోలను ‘అల్-జజీరా అరేబియా’ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఆయన 2020 డిసెంబర్ లో ఆఫ్ఘనిస్తాన్‌ను వీడి జర్మనీ చేరుకోగా.. లెపిజి‌గ్ నివసిస్తున్నారు. సాదత్ 2018లో ఆఫ్ఘన్ అధ్యక్షుడు ‘అష్రఫ్ ఘనీ’ మంత్రివర్గంలో చేరారు. కానీ, అతనితో విభేదాల కారణంగా 2020లో తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత తరువాత ఆఫ్ఘనిస్తాన్ వదిలి జర్మనీ వెళ్లాడు.

ప్రస్తుతం జర్మనీలో ఉంటున్న సాదత్‌తో ‘స్కై న్యూస్’ మాట్లాడగా.. అందుకు సంబంధించిన ఫొటోలు ట్విట్టర్‌లో దర్శనమిచ్చాయి. ఆ న్యూస్ చానెల్ కథనం ప్రకారం.. సాదత్ డబ్బు అయిపోయాక అతను జర్మన్ కంపెనీ అయిన ‘లివ్రాండోకు ఫుడ్ డెలివరీ ప్రొఫెషనల్‌’గా పనిచేయడం ప్రారంభించాడు.

ఒకప్పుడు చుట్టూ భద్రతా సిబ్బందితో గడిపిన సాదత్ ఇప్పుడు సైకిల్ పై పిజ్జాను డెలివరీ చేయడం గురించి ప్రశ్నించగా.. ఆసియా మరియు అరబ్ సామ్రాజ్యంలో ఉన్నత స్థాయి వ్యక్తులుగా జీవించి.. ఆ తర్వాత సాధారణ జీవనాన్ని గడపాలనుకునే వ్యక్తులను తన లైఫ్ స్టోరీ ‘‘ఉత్ప్రేరకం’’ (Catalyst)గా ఉపయోగపడుతుందని ఆయన జవాబిచ్చారు.

ఇదిలాఉండగా.. సాదత్ ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి కమ్యూనికేషన్స్ మరియు ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్‌లో రెండు మాస్టర్స్ డిగ్రీలను పొందారు. అతను ఆరామ్‌కో మరియు సౌదీ టెలికాం కంపెనీ కోసం సౌదీ అరేబియాతో సహా 13 దేశాలలో 20కి పైగా కంపెనీలతో కమ్యూనికేషన్ రంగంలో 23 సంవత్సరాలు పనిచేశాడు. తన రెండు దశాబ్దాల అనుభవంలో, సాదత్ 2005 నుండి 2013 వరకు ఆఫ్ఘనిస్తాన్ కమ్యూనికేషన్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు సాంకేతిక సలహాదారుగా పనిచేశారు. 2016 నుండి 2017 వరకు లండన్‌లో అరియానా టెలికాం CEOగా కూడా పనిచేశారు.

చివరగా ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలపై స్పందించిన సాదత్.. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఇంత త్వరగా పడిపోతుందని తాను ఊహించలేదని తెలిపారు. కాగా, 2021 ఆగష్టు 15న ఆఫ్ఘనిస్తాన్ పూర్తిగా తాలిబాన్ల నియంత్రణలోకి వెళ్లిపోయింది. తిరుగుబాటు దారుల బృందం రాజధాని కాబూల్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నారు. అధ్యక్షుడు ‘ఘనీ’ మరుసటి రోజున దేశం విడిచి UAEలో తలదాచుకన్నట్టు పలు కథనాలు వెలువడ్డాయి.

Tags:    

Similar News