ముందుకొచ్చిన సముద్రం.. అప్రమత్తమైన అధికారులు

దిశ-ఉత్తరాంధ్ర: విశాఖ ఆర్కే బీచ్‌లో సముద్రం ముందుకు వచ్చింది. దీంతో  ఆర్కే బీచ్‌ నుంచి దుర్గాలమ్మ గుడి వరకు సుమారు 200 మీటర్ల మేర భూమి కోతకు గురైంది. దీంతో  చిల్డ్రన్‌ పార్కులో ఉన్న  ప్రహరీ గోడ కూడా కూలిపోయింది. అంతేకాకుండా సముద్రం ముందుకు రావడంతో ఆ ప్రాంతంలో పలుచోట్ల భూమి కుంగిపోయి పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో ఆర్కే బీచ్‌ వద్దకు పర్యాటకులకు అనుమతి నిషేధిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. సందర్శకులు ఎవరూ  రాకుండా బారికేడ్లు […]

Update: 2021-12-05 04:48 GMT

దిశ-ఉత్తరాంధ్ర: విశాఖ ఆర్కే బీచ్‌లో సముద్రం ముందుకు వచ్చింది. దీంతో ఆర్కే బీచ్‌ నుంచి దుర్గాలమ్మ గుడి వరకు సుమారు 200 మీటర్ల మేర భూమి కోతకు గురైంది. దీంతో చిల్డ్రన్‌ పార్కులో ఉన్న ప్రహరీ గోడ కూడా కూలిపోయింది. అంతేకాకుండా సముద్రం ముందుకు రావడంతో ఆ ప్రాంతంలో పలుచోట్ల భూమి కుంగిపోయి పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో ఆర్కే బీచ్‌ వద్దకు పర్యాటకులకు అనుమతి నిషేధిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. సందర్శకులు ఎవరూ రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. తుపాను ప్రభావంతోనే సముద్రం ముందుకొచ్చి ఉంటుందని ఈ సందర్భంగా అధికారుల అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News