డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ప్రకాష్‌రాజ్ కౌంటర్
తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో ప్రస్తుతం తిరుపతి లడ్డు తయారీ అపచారం పై చర్చ నడుస్తోంది.
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో ప్రస్తుతం తిరుపతి లడ్డు తయారీ అపచారం పై చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పవన్ కల్యాణ్ తిరుమల లడ్డూ వివాదంపై స్పందించగా.. ట్విట్టర్ వేదికగా స్పందించిన ప్రకాష్ రాజ్ డిప్యూటీ సీఎం ఫైర్ అయ్యారు. శ్రీవారి లడ్డూ అపవిత్రంపై తాను మాట్లాడితే ప్రకాశ్ రాజ్‌కు ఏం సంబంధమని, ఆయన తన సహచర నటుడే అయినా సనాతన ధర్మంపై జాగ్రత్తగా మాట్లాడని సూచించారు. తాను లడ్డూను అపవిత్రం చేయొద్దని చెబితే తప్పా అని ప్రశ్నించారు. సనాతన ధర్మం అంటే తమ సెంటిమెంట్ అని, సరదాగా మాట్లాడే ముందే 100 సార్లు ఆలోచించుకోవాలని హెచ్చరించారు.
ఈ వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ (Actor Prakash Raj) మంగళవారం ట్విటర్ట్ వేదికగా డిప్యూటీ పవన్ కల్యాణ్‌కు కౌంటర్ ఇచ్చారు. నేను చెప్పిందేంటి, మీరు అపార్థం చేసుకుని తిప్పుతున్న దేంటి?.. నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్‌లో ఉన్నాను. ఈ నెల 30న తిరిగి ఇండియాకు వచ్చిన తర్వాత మీ ప్రతి మాటకు సమాధానం చెబుతాను. మీకు వీలైతే నా ట్వీట్‌ను మళ్లీ చదవండి. అర్థం చేసుకోండి ప్లీజ్ అంటూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. కాగా సినీ నటుడు ప్రకాష్ రాజ్ గతంలో ఏపీలో పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారని, లడ్డూ వివాదంపై విచారణ చేయించాలని ప్రకాష్ రాజ్ డిమాండ్ చేశారు. అంతేకాదు దోషులను గుర్తించి శిక్షించాలని సూచించారు. అయితే లడ్డూ వివాదాన్ని దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా ఎందుకు రెచ్చ గొడుతున్నారని ప్రకాష్ అన్నారు.. మత ఘర్షణలు దేశానికి వద్దని, కేంద్రంలోని పవన్ మిత్రులకు ధన్యవాదాలు అంటూ ఎక్స్ వేదికగా ప్రకాశ్‌రాజ్ వ్యగ్యంగా కామెంట్స్ చేశారు.