AP News:పట్టణ సమస్యల పై ఈ నెల 26న మున్సిపల్ కార్యాలయం ముట్టడి:CPI

నంద్యాల పట్టణంలోని 42 వార్డులలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఈ నెల 26న మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఈరోజు నంద్యాల సీపీఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.

Update: 2024-09-24 09:24 GMT

దిశ ప్రతినిధి, నంద్యాల సిటీ: నంద్యాల పట్టణంలోని 42 వార్డులలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఈ నెల 26న మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఈరోజు నంద్యాల సీపీఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పట్టణ కార్యదర్శి కె. ప్రసాద్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి.సోమన్న, ఏఐటియుసి అధ్యక్ష కార్యదర్శులు భూమని శ్రీనివాసులు, డి శ్రీనివాసులు, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ధనుంజయ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కోశాధికారి సురేష్, సలీం నగర్ సిపిఐ శాఖ సహాయ కార్యదర్శి సుబ్బరాయుడు పాల్గొన్నారు. అనంతరం సీపీఐ పట్టణ కార్యదర్శి కె.ప్రసాద్ మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో వీధి కుక్కలు, పిచ్చి కుక్కలతో దోమలతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఏ మాత్రం మున్సిపల్ అధికారులు పట్టించుకోవడంలేదని అన్నారు.

మున్సిపల్ అధికారులు వార్డులలో ఫాగింగ్ చేసి దోమల నివారణ చర్యలు చేపట్టలేదని, మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు వీధి కుక్కల గురించి మెమొరాండం, ధర్నా నిర్వహించిన చలనం లేదని అన్నారు. అదేవిధంగా నందమూరి నగర్ వైయస్ నగర్ లో ఇంకా కొన్ని వార్డులలో ఇప్పటికీ సిసి రోడ్లు లేక డ్రైనేజీలు లేక చిన్నపాటి వర్షానికి వర్షపు నీరు నిలబడి దోమలు వృద్ధి చెంది విషపురుగులతో అక్కడి ప్రజలు సహజీవనం చేస్తున్నట్లు తెలిపారు. దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ అక్కడ ప్రభుత్వం ఇచ్చిన స్థలాలు చేతులు మారుతూ ఖాళీ స్థలలగా దర్శనమిస్తూ ఉంటాయని చెప్పారు. ఇలా అనేక సమస్యలు పట్టణంలో తాండవిస్తున్నాయి. మున్సిపల్ అధికారులకు కనువిప్పు కలగాలని ఈ సమస్యల పై భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ పట్టణ సమితిగా ఈనెల 26వ తారీఖున మున్సిపల్ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.


Similar News