సీఎస్‌గా ఆదిత్యనాథ్‌దాస్ బాధ్యతల స్వీకరణ

దిశ, ఏపీబ్యూరో : ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా గురవారం ఆదిత్యనాథ్‌దాస్ బాధ్యతలు స్వీకరించారు. సచివాలయం మొదటి బ్లాక్‌లో సీఎస్​ నీలం సాహ్ని నుంచి బాధ్యతలు చేపట్టారు. నీలం సాహ్ని పదవీ కాలం ముగిసినందున ఆమె స్థానంలో ఆదిత్యానాథ్‌ దాస్‌కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. పదవీకాలం పూర్తి అనంతరం సీఎం ప్రిన్సిపల్ అడ్వైజర్‌గా నీలం సాహ్ని విధులు నిర్వర్తించనున్నారు. ఈ సందర్భంగా ఆదిత్యనాధ్​దాస్​ మాట్లాడుతూ సీఎస్‌గా తనకు అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వ అజెండానే […]

Update: 2020-12-31 07:13 GMT

దిశ, ఏపీబ్యూరో : ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా గురవారం ఆదిత్యనాథ్‌దాస్ బాధ్యతలు స్వీకరించారు. సచివాలయం మొదటి బ్లాక్‌లో సీఎస్​ నీలం సాహ్ని నుంచి బాధ్యతలు చేపట్టారు. నీలం సాహ్ని పదవీ కాలం ముగిసినందున ఆమె స్థానంలో ఆదిత్యానాథ్‌ దాస్‌కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. పదవీకాలం పూర్తి అనంతరం సీఎం ప్రిన్సిపల్ అడ్వైజర్‌గా నీలం సాహ్ని విధులు నిర్వర్తించనున్నారు.

ఈ సందర్భంగా ఆదిత్యనాధ్​దాస్​ మాట్లాడుతూ సీఎస్‌గా తనకు అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వ అజెండానే తమ అజెండా అని తెలిపారు. అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుని పనిచేస్తానని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని సీఎం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. సీఎం తలపెట్టిన లక్ష్యం మేరకు పోలవరం పూర్తి చేస్తామని వెల్లడించారు. అన్ని సమస్యలను అధిగమించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు. సీఎం జగన్‌కు ఆదిత్యనాథ్ దాస్ కృతజ్ఞతలు తెలిపారు.

Tags:    

Similar News