భయాందోళనలో ఆదిత్యన‌గ‌ర్ కాల‌నీ.. కారణం ఇదే..!

దిశ‌, అబ్దుల్లాపూర్‌మెట్‌: గ‌త ఏడాది అక్టోబ‌ర్‌లో కురిసిన భారీ వ‌ర్షాలకు తుర్కయంజాల్ మున్సిపాలిటీ ప్రజ‌లు చిగురుటాకులా వ‌ణికిపోయారు. చుట్టుప‌క్కల ఉన్న అన్ని చెరువులు అలుగుపారి సుమారు 10 కాల‌నీల‌ను ముంచెత్తాయి. లోత‌ట్టు ప్రాంతాల్లో నెల‌ల త‌ర‌బ‌డి నీరు నిల్వ ఉండి ప్రజ‌లు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆదిత్యన‌గ‌ర్ కాల‌నీ మొత్తం నీట‌మునిగి రాష్ట్రవ్యాప్త సంచ‌ల‌నంగా మారింది. మ‌ళ్లీ వ‌ర్షాకాలం షురూ కావ‌డంతో స్థానికుల్లో భ‌యాందోళ‌న‌లు మొద‌ల‌య్యాయి. బిక్కుబిక్కుమంటున్న ఆదిత్యన‌గ‌ర్‌ వందేళ్లలో ఎన్నడూ లేని విధంగా మాసాబ్‌చెరువు పూర్తిగా […]

Update: 2021-06-11 06:39 GMT

దిశ‌, అబ్దుల్లాపూర్‌మెట్‌: గ‌త ఏడాది అక్టోబ‌ర్‌లో కురిసిన భారీ వ‌ర్షాలకు తుర్కయంజాల్ మున్సిపాలిటీ ప్రజ‌లు చిగురుటాకులా వ‌ణికిపోయారు. చుట్టుప‌క్కల ఉన్న అన్ని చెరువులు అలుగుపారి సుమారు 10 కాల‌నీల‌ను ముంచెత్తాయి. లోత‌ట్టు ప్రాంతాల్లో నెల‌ల త‌ర‌బ‌డి నీరు నిల్వ ఉండి ప్రజ‌లు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆదిత్యన‌గ‌ర్ కాల‌నీ మొత్తం నీట‌మునిగి రాష్ట్రవ్యాప్త సంచ‌ల‌నంగా మారింది. మ‌ళ్లీ వ‌ర్షాకాలం షురూ కావ‌డంతో స్థానికుల్లో భ‌యాందోళ‌న‌లు మొద‌ల‌య్యాయి.

బిక్కుబిక్కుమంటున్న ఆదిత్యన‌గ‌ర్‌

వందేళ్లలో ఎన్నడూ లేని విధంగా మాసాబ్‌చెరువు పూర్తిగా నిండి బ్యాక్‌వాట‌ర్‌ ఆదిత్యన‌గ‌ర్ కాల‌నీని ముంచెత్తింది. సుమారు 45 కుటుంబాలు నాలుగు నెల‌ల పాటు పూర్తిగా నీటిలోనే సంసారం వెళ్లదీసిన దుస్థితి రాష్ట్ర ప్రజ‌ల‌ను క‌ల‌చివేసింది. కాల‌నీ వాసులు సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, స‌బిత‌ను క‌లిసి గోడు వెళ్లబోసుకున్నా ఫ‌లితం శూన్యంగా మిగిలింది. చివ‌రకు హైకోర్టు ఆదేశాల‌తో చెరువు తూము విప్పి తాత్కాలికంగా కొంత‌మేర నీటిని విడుద‌ల చేసి ఉప‌శ‌మ‌నం క‌లిగించారు. ఇప్పటికీ చెరువు నిండుకుండ‌ను త‌ల‌పిస్తుండ‌టంతో చిన్నపాటి వ‌ర్షానికైనా ఆదిత్యన‌గ‌ర్ కాల‌నీని ముంచెత్తే ప్రమాదం పొంచి ఉంది. ఏ రాత్రి ఎలాంటి ఉప‌ద్రవం వ‌స్తుందోన‌ని స్థానికులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.

క‌న్పించ‌ని అధికారుల ముంద‌స్తు ప్రణాళిక‌లు

గ‌త ఏడాది సృష్టించిన జ‌ల‌ప్రళ‌యంతో ప్రజ‌లు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న సంగ‌తి తెలిసినా… వాటిని అధిగ‌మించేందుకు అధికారులు, పాల‌కుల్లో ముంద‌స్తు ప్రణాళిక‌లేవీ క‌న్పించ‌డంలేదు. ఈ ఏడాది వ‌ర‌ద ముంపు నుంచి త‌ప్పించుకోవాలంటే డ్రైనేజీల్లో, కాలువ‌ల్లో పేరుకుపోయిన చెత్తను వెంట‌నే తొల‌గించాలని ప్రజ‌లు డిమాండ్ చేస్తున్నారు. వ‌ర‌ద నీటిని చెరువు నుంచి ఎప్పటిక‌ప్పుడు దిగువ‌కు విడుద‌ల చేసే విధంగా చ‌ర్యలు చేప‌ట్టాల‌ని కోరుతున్నారు.

ఆదిత్యన‌గ‌ర్‌కు ఈ ఏడాది కూడా వ‌ర‌ద ముంపు పొంచి ఉంది. మాసాబ్‌చెరువు నిండుకుండ‌లా ఉండ‌టంతో చిన్నవ‌ర్షానికైనా బ్యాక్‌వాట‌ర్ కాల‌నీని ముంచెత్తే ప్రమాదం ఉంది. వ‌ర్షం నీరే కాకుండా, మురుగునీరు కూడా చెరువులో భారీగా క‌లుస్తోంది. అధికారులు వాట‌ర్ మేనేజ్‌మెంట్ స‌క్రమంగా నిర్వర్తించాలి. మాసాబ్‌చెరువు అలుగును త‌గ్గించి దిగువ‌కు నీటిని వ‌ద‌లాలి. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల‌ను అమ‌లు చేయాలి. చెరువు ఎఫ్టీఎల్ నిర్ధారించి కాంక్రీట్‌తో ప‌టిష్టమైన కాంపౌండ్ వాల్ నిర్మించాలి. రేనారెడ్డి, ఆదిత్యన‌గ‌ర్ కాల‌నీ పోరాట స‌మితి నేత‌

Tags:    

Similar News