ఏపీలో కరోనాయే లేదు.. ఎన్నికలు వాయిదా: సురేష్
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా లేనప్పటికీ స్థానిక ఎన్నికలను ఎలక్షన్ కమిషన్ వాయిదా వేసిందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, గత సండే బ్లాక్ డే అని అన్నారు. వాస్తవానికి ఎన్నికలను వాయిదా వేసే అధికారం ఈసీకి లేదని ఆయన తెలిపారు. ఆయన నిర్ణయం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని వ్యాఖ్యానించారు. కరోనా వైరస్ నిరోధానికి విశేషంగా కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. పదో తేదీనే విద్యాశాఖ ద్వారా డీఈవోలు, ఎంఈవోలు, ఆర్జేడీలు, ప్రధానోపాధ్యాయులు, […]
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా లేనప్పటికీ స్థానిక ఎన్నికలను ఎలక్షన్ కమిషన్ వాయిదా వేసిందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, గత సండే బ్లాక్ డే అని అన్నారు. వాస్తవానికి ఎన్నికలను వాయిదా వేసే అధికారం ఈసీకి లేదని ఆయన తెలిపారు. ఆయన నిర్ణయం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని వ్యాఖ్యానించారు. కరోనా వైరస్ నిరోధానికి విశేషంగా కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. పదో తేదీనే విద్యాశాఖ ద్వారా డీఈవోలు, ఎంఈవోలు, ఆర్జేడీలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు కరోనా నిరోధానికి చేపట్టాల్సిన చర్యలపై సమగ్రమైన సూచనలు అందజేశామని ఆయన చెప్పారు. ఇప్పుడు వాయిదా వేసిన రమేష్, 2018లో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఎందుకు కోరలేదు? అని ఆయన ప్రశ్నించారు. కరోనాను ఎదుర్కోవాలంటే నిధులు కావాలని, తన నిర్ణయంతో రమేష్ కుమార్ కేంద్రం నుంచి నిధులు రాకుండా చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేయడం ద్వారా ప్రభుత్వాన్ని బలహీన పర్చాలని ఈసీ ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.
tags : ec, ramesh babu, adimulapu suresh, local body elections