ఆ మున్సిపాలిటీలో కమిషనర్‌దే ఇష్ట రాజ్యం

దిశ ప్రతినిధి రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో అధికారం దక్కించుకోవడానికి టీఆర్ఎస్ అనేక జిమ్మిక్కులు చేసింది. ఇందులో భాగంగా 8 మున్సిపాలిటీలు తమ ఖాతాలో ఉన్నట్లు భ్రమపడుతున్నది. ఎందుకంటే 8 మున్సిపాలిటీల్లో కౌన్సిలర్ల మద్దతుతో కాకుండా ఎక్స్అఫీషియో, ఇతర పార్టీ సభ్యులను పార్టీలోకి తీసుకోని చైర్మన్లను నిలబెట్టుకుంది. కానీ పార్టీ మారిన సభ్యులను పట్టించుకున్న పాపన పోవడం లేదు. చైర్మన్ ఎన్నికల నాటి వరకే ఆ సభ్యులకు అండగా ఉన్నట్లు చేసి ఆ తర్వాత అధికార […]

Update: 2020-12-10 21:18 GMT

దిశ ప్రతినిధి రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో అధికారం దక్కించుకోవడానికి టీఆర్ఎస్ అనేక జిమ్మిక్కులు చేసింది. ఇందులో భాగంగా 8 మున్సిపాలిటీలు తమ ఖాతాలో ఉన్నట్లు భ్రమపడుతున్నది. ఎందుకంటే 8 మున్సిపాలిటీల్లో కౌన్సిలర్ల మద్దతుతో కాకుండా ఎక్స్అఫీషియో, ఇతర పార్టీ సభ్యులను పార్టీలోకి తీసుకోని చైర్మన్లను నిలబెట్టుకుంది. కానీ పార్టీ మారిన సభ్యులను పట్టించుకున్న పాపన పోవడం లేదు. చైర్మన్ ఎన్నికల నాటి వరకే ఆ సభ్యులకు అండగా ఉన్నట్లు చేసి ఆ తర్వాత అధికార పార్టీ ఎమ్మెల్యేలు, అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కమిషనర్ ఇష్టారాజ్యం
రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల మున్సిపాలిటీలోని కమిషనర్ ప్రజాప్రతినిధుల, ప్రజాభిప్రాయం లేకుండానే అభివృద్ధి పనులకు తీర్మానాలు జరిగిపోయాయని, నిధులన్నీ దుర్వినియోగమవుతున్నాయని ఆరోపణలు వినబడుతున్నాయి. ఆదిబట్ల పాలకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఒక అభివృద్ధి పనికి కూడా తీర్మానం జరగలేదనే సమాచారం ఉంది. అలాగే స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు సమాచార హక్కు చట్టం కింద వివరాలను కోరినా ఇవ్వడం లేదని తెలుస్తోంది. ఏకంగా మున్సిపల్ చైర్మన్ కొత్త ఆర్థికప్రవీణ్ గౌడ్​కార్పొరేట్ కళాశాలు, స్థానిక పరిశ్రమల నుంచి ఆస్తి పన్ను వసూలు చేస్తున్నారా.. కాలుష్య నియంత్రణ మండలి, అగ్నిమాపక సంస్థల అనుమతులు ఎన్నింటికి ఉన్నాయి అనే వివరాలను కమిషనర్​ను కోరితే వివరాలు ఇచ్చేందుకు సుముఖత చూపలేదు. దీంతో మున్సిపల్​చైర్మన్ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. దీనికి సైతం కమిషనర్​ స్పందించకపోగా.. ఎందుకివ్వాలంటూ ప్రజాప్రతినిధులకు కౌంటర్ వేస్తున్నట్లు వాపోతున్నారు.

కరువైన జవాబుదారీతనం..

గ్రేటర్ హైదరాబాద్​కు కూతవేటు దూరంలో ఉన్న ఆదిబట్ల మున్సిపాలిటీ ప్రజలకు జవాబుదారీతనం కరువైంది. ఇక్కడ పెద్ద పెద్ద ఐటీ, టెక్నికల్ కంపెనీలతో పాటు కార్పొరేట్​కాలేజీలు, చిన్న, మధ్యతరగతి పరిశ్రమలు కలిపి సుమారుగా 100కు పైనే ఉన్నాయి. అయితే కొన్ని పరిశ్రమలు రాత్రి సమయంలో విషవాయువులను గాలిలోకి వదులుతున్నట్లు బహిర్గతమవుతోంది. దీంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. కానీ స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలపై ప్రశ్నించే అవకాశం లేకుండా కమిషనర్​నియంతగా మారి వ్యహరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్, ఎమ్మెల్యేలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని తెలుస్తుంది. దీనంతటికి కారణం అధికార పార్టీ నేతలతో ఉన్న పరిచయాలే కారణమని సమాచారం.

ఎమ్మెల్యే ఎందుకు వదిలేశాడు..?

ఆదిబట్ల మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి బలం ఉన్నప్పటికీ అధికార టీఆర్ఎస్ పై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన 14వ వార్డు సభ్యురాలు కొత్త ఆర్థిక మద్దతు పలికింది. దీంతో ఆమెకు చైర్మన్ పదవి ఇచ్చారు. కానీ నేడు ఆ చైర్మన్​కు పార్టీగానీ, మున్సిపాలిటీ కమిషనర్ మద్దతు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. తరుచూ వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈవిషయం స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి తెలిసినా సమస్య పరిష్కారానికి ఎందుకు ముందుకురావడం లేదనే చర్చ సాగుతున్నది. ఆనాడు చైర్మన్ ఇస్తామని కాంగ్రెస్ సభ్యురాలను టీఆర్ఎస్ చేర్చుకొని నేడు అవసరం లేదనే విధంగా ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా మున్సిపల్ కమిషనర్ కు ఎమ్మెల్యే మద్దతు ఫుల్​గా ఉండటంతోనే చైర్మన్​డమ్మీ చేయడమే కాకుండా మార్చేందుకు కుట్రలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News