కరోనా కట్టడికి పోలీసుల కృషి: నర్మద

దిశ నల్గొండ: కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి పోలీస్ శాఖ కీలకంగా పని చేస్తుందని జిల్లా అదనపు ఎస్పీ నర్మద అన్నారు. ఈ నేపథ్యంలో విధి నిర్వహణలో ఉన్న సిబ్బందికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని ఆమె తెలిపారు. బుధవారం అంతరాష్ట్ర సరిహద్దులైన వాడపల్లి, నాగార్జున సాగర్, తదితర ప్రాంతాల్లో విధి నిర్వహణ చేస్తున్న సిబ్బందికి గల సౌకర్యాలను ఆమె పరిశీలించారు. కరోనా వైరస్ నేపథ్యంలో పోలీస్ అధికారులకు మాస్కులు, శానిటైజర్లు అందచేశామని […]

Update: 2020-04-01 07:26 GMT

దిశ నల్గొండ: కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి పోలీస్ శాఖ కీలకంగా పని చేస్తుందని జిల్లా అదనపు ఎస్పీ నర్మద అన్నారు. ఈ నేపథ్యంలో విధి నిర్వహణలో ఉన్న సిబ్బందికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని ఆమె తెలిపారు. బుధవారం అంతరాష్ట్ర సరిహద్దులైన వాడపల్లి, నాగార్జున సాగర్, తదితర ప్రాంతాల్లో విధి నిర్వహణ చేస్తున్న సిబ్బందికి గల సౌకర్యాలను ఆమె పరిశీలించారు. కరోనా వైరస్ నేపథ్యంలో పోలీస్ అధికారులకు మాస్కులు, శానిటైజర్లు అందచేశామని నర్మద చెప్పారు. సరిహద్దు చెక్ పోస్టుల వద్ద సిబ్బందికి మంచినీటి సౌకర్యం, టెంట్లు, భోజన వసతి తదితర సౌకర్యాలు కల్పిస్తున్న స్థానిక పోలీస్ అధికారులతో ఆమె సమీక్షించారు. సిబ్బంది మొత్తం సామాజిక దూరం పాటించాలని, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎండ తీవ్రత పెరిగినందున రెండు, మూడు రోజులలో చెక్ పోస్టుల వద్ద కూలర్స్ ఏర్పాటు చేయించడంతో పాటు కార్పెట్లు, మరి కొన్ని టెంట్లు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని నల్గొండ అదనపు ఎస్పీ నర్మద వివరణ ఇచ్చారు.

Tags: Additional SP narmada, comments, police, facilities, lockdown, nalgonda

Tags:    

Similar News