కొనుగోలులో నాణ్యత ప్రమాణాలను పాటించాలి
దిశ, మెదక్: వరి ధాన్యం కొనుగోలులో నాణ్యత ప్రమాణాలను పాటించాలని సిద్దిపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ పద్మాకర్ అన్నారు. సిద్దిపేట కలెక్టరేట్‌లో అధికారులు, రైస్ మిల్లుల యజమానులతో వేరు వేరుగా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాణ్యత విషయంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే మిల్లర్లు, సెంటర్ నిర్వాహకులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రం నుంచి వచ్చిన ధాన్యాన్ని 24 గంటలలోపు అన్‌లోడ్ చేయాలన్నారు. మిల్లులలో ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి ప్రాధాన్యత […]
దిశ, మెదక్: వరి ధాన్యం కొనుగోలులో నాణ్యత ప్రమాణాలను పాటించాలని సిద్దిపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ పద్మాకర్ అన్నారు. సిద్దిపేట కలెక్టరేట్‌లో అధికారులు, రైస్ మిల్లుల యజమానులతో వేరు వేరుగా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాణ్యత విషయంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే మిల్లర్లు, సెంటర్ నిర్వాహకులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రం నుంచి వచ్చిన ధాన్యాన్ని 24 గంటలలోపు అన్‌లోడ్ చేయాలన్నారు. మిల్లులలో ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి ప్రాధాన్యత ఉండేలా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.
tags: Additional Collector Padmakar, Review, Grain purchases, siddipet