గడువులోపు టాయిలెట్ల నిర్మాణం పూర్తికావాలి
దిశ, అచ్చంపేట : పట్టణ ప్రగతిలో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మున్సిపాలిటీలో జిల్లా అదనపు కలెక్టర్ మను చౌదరి గురువారం పర్యటించారు. జిల్లాలోని ప్రధాన రహదారి వైపున గల వ్యాపారస్తులు రోడ్డుపైనే చెత్తాచెదారం వేయడంపై ఆయన అధికారులపై మండిపడ్డారు. మున్సిపల్‌కు సంబంధించిన చెత్త వాహనాలు లేవా ఉంటే ఎందుకు ఈ చెత్తను తొలగించే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలోని వివిధ కాలనీల్లో పర్యటించిన ఆయన మున్సిపల్ వాహనం వస్తుందా అని ఆరా తీయగా […]
దిశ, అచ్చంపేట :
పట్టణ ప్రగతిలో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మున్సిపాలిటీలో జిల్లా అదనపు కలెక్టర్ మను చౌదరి గురువారం పర్యటించారు. జిల్లాలోని ప్రధాన రహదారి వైపున గల వ్యాపారస్తులు రోడ్డుపైనే చెత్తాచెదారం వేయడంపై ఆయన అధికారులపై మండిపడ్డారు. మున్సిపల్‌కు సంబంధించిన చెత్త వాహనాలు లేవా ఉంటే ఎందుకు ఈ చెత్తను తొలగించే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పట్టణంలోని వివిధ కాలనీల్లో పర్యటించిన ఆయన మున్సిపల్ వాహనం వస్తుందా అని ఆరా తీయగా .. రెండు రోజులకు ఒకసారి వస్తుందని మహిళలు సమాధానం ఇచ్చారు. వ్యాపారస్తులు కూడా చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయొద్దని సూచించారు. వ్యాపారస్తులు పరిశుభ్రతకు సంబంధించి నిబంధనలు పాటించకపోతే వారికి జరిమానాలు విధించాలని అధికారులను ఆదేశించారు.
పట్టణంలోని ప్రభుత్వ వైద్య కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న మరుగుదొడ్ల నిర్మాణం వచ్చే నెల ఆగస్టు 15 వరకు పూర్తి చేయాలని నిబంధనలు ఉన్నప్పటికీ, జరుగుతున్న పనులను బట్టి కాంట్రాక్టర్ ఆగస్టు 31 వరకు పూర్తి చేసేలా అధికారులు మానిటరింగ్ చేయాలని ఆదేశించారు. అలాగే పట్టణములో పకృతి వనంలో అన్ని రకాల పండ్ల మొక్కలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పర్యటనలో అచ్చంపేట మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు ఉన్నారు.