నాణ్యత కలిగిన ధాన్యం వచ్చేలా చూడాలి

దిశ, ఆదిలాబాద్: కొనుగోలు కేంద్రాలకు రైతులు నాణ్యత కలిగిన ధాన్యం తీసుకొని వచ్చేలా చూడాలని అదనపు కలెక్టర్ ఏ భాస్కర్ రావు వ్యవసాయ అధికారులు ఆదేశించారు. సోమవారం వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాలు, సహకార శాఖ, డీసీఎంఎస్, రైస్ మిల్లర్లతో నిర్వహించిన జిల్లా సేకరణ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రబీలో 2.41 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని, ధాన్యం సేకరణ కోసం 204 కొనుగోలు కేంద్రాలను […]

Update: 2020-04-13 08:50 GMT

దిశ, ఆదిలాబాద్: కొనుగోలు కేంద్రాలకు రైతులు నాణ్యత కలిగిన ధాన్యం తీసుకొని వచ్చేలా చూడాలని అదనపు కలెక్టర్ ఏ భాస్కర్ రావు వ్యవసాయ అధికారులు ఆదేశించారు. సోమవారం వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాలు, సహకార శాఖ, డీసీఎంఎస్, రైస్ మిల్లర్లతో నిర్వహించిన జిల్లా సేకరణ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రబీలో 2.41 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని, ధాన్యం సేకరణ కోసం 204 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ధాన్యం కొనుగోలుకు కావలసిన మౌలికవసతులు సమకూర్చాలని మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు మాత్రమే ధాన్యం తీసుకెళ్లేలా రైతులకు టోకెన్లు ఇవ్వాలని సూచించారు. రైసు మిల్లుకు వచ్చిన ధాన్యాన్ని వెంట వెంటనే అన్‌లోడ్ చేసుకునేందుకు హమాలీలను కూడా ఉంచాలని రైస్ మిల్లర్‌ నిర్వహకులకు ఆదేశాలు జారీ చేశారు.

tag: Additional collector Bhaskar Rao, meeting, Officials, Grain purchases, nirmal
slug:

Tags:    

Similar News