రూ. 5,600 కోట్ల పెట్టుబడులు సాధించిన అదానీ పోర్ట్స్!

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ గ్రూప్ సంస్థ అదానీ గ్రూప్ అంతర్జాతీయ కంపెనీల పెట్టుబడులను ఆకర్షిస్తోంది. అదానీ గ్రూపునకు చెందిన అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్(ఏపీఎస్ఈజెడ్) సంస్థ గ్లోబల్ ఇన్వెస్టర్ల నుంచి 750 మిలియన్ డాలర్ల(రూ. 5,600 కోట్ల) వరకు నిధులను సేకరించినట్టు మంగళవారం వెల్లడించింది. ఈ నిధులను 20 ఏళ్లు, 10.5 ఏళ్ల బాండ్ల అన్‌సెక్యూర్‌డ్ యూఎస్ నోట్ల జారీ ద్వారా సేకరించినట్టు తెలిపింది. అదానీ పోర్ట్ సెజ్‌లు ఈ ఏడాది జులై […]

Update: 2021-07-27 06:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ గ్రూప్ సంస్థ అదానీ గ్రూప్ అంతర్జాతీయ కంపెనీల పెట్టుబడులను ఆకర్షిస్తోంది. అదానీ గ్రూపునకు చెందిన అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్(ఏపీఎస్ఈజెడ్) సంస్థ గ్లోబల్ ఇన్వెస్టర్ల నుంచి 750 మిలియన్ డాలర్ల(రూ. 5,600 కోట్ల) వరకు నిధులను సేకరించినట్టు మంగళవారం వెల్లడించింది. ఈ నిధులను 20 ఏళ్లు, 10.5 ఏళ్ల బాండ్ల అన్‌సెక్యూర్‌డ్ యూఎస్ నోట్ల జారీ ద్వారా సేకరించినట్టు తెలిపింది. అదానీ పోర్ట్ సెజ్‌లు ఈ ఏడాది జులై 26 నుంచి షేర్ల జారీని నిలిపేసింది. ఈ షేర్లు మూడుసార్లు అంతకంటే ఎక్కువగానే సబ్‌స్క్రైబ్ అయ్యాయి. అన్ని ప్రాంతాల్లో అధిక నాణ్యత కలిగిన పెట్టుబడిదారుల నుంచి పటిష్టమైన భాగస్వామ్యాన్ని ఏపీఎస్ఈజెడ్ అందుకుందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి 20 ఏళ్లుగా ఏపీఎస్ఈజెడ్ విజయవంతంగా నిధులను సేకరిస్తున్న ఏకైక మౌలిక సదుపాయాల సంస్థ అని వివరించింది. సంస్థకున్న ప్రత్యేక వ్యాపార విధానం, బలమైన ప్రాథమిక అంశాల కారణంగానే ఈ ఘనతను సాధించినట్టు పేర్కొంది. విదేశీ పెట్టుబడిదారుల నుంచి అదానీ పోర్ట్ సెజ్‌ల రుణాల నిష్పత్తి 69 శాతం నుంచి 73 శాతానికి పెరిగిందని కంపెనీ తెలిపింది. మూలధన వ్యయం తగ్గిన నేపథ్యంలో వాటాదారులకు అధిక మూలధన రాబడి ఉంటుందని కంపెనీ సీఈఓ కరణ్ అదానీ చెప్పారు. తాజాగా సేకరించిన నిధులను దీర్ఘకాలిక మూలధన నిర్వహణకు వినియోగించనున్నట్టు ఆయన వెల్లడించారు.

Tags:    

Similar News