‘పవన్ సినిమాకు నో చెప్పిన శ్రీ రెడ్డి’

దిశ, వెబ్ డెస్క్: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ అసెంబ్లీ ఎన్నికల తర్వాతి కథ అంటూ ‘‘పవర్ స్టార్’’ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. దానికి కౌంటర్‌గా పవర్ స్టార్ అభిమానులు కూడా ఆర్జీవీ జీవిత చరిత్రపై ‘‘పరాన్న జీవి’’ అనే సినిమా తెరకెక్కిస్తున్నారు. పవన్ కళ్యాణ్ వీరాభిమాని, ‘బిగ్ బాస్’ సీజన్ 2 కంటెస్టెంట్ నూతన్ నాయుడు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. వర్మ చేస్తున్న ‘పవర్ స్టార్’ సినిమాకు పోటీగా ఈ […]

Update: 2020-07-20 10:45 GMT

దిశ, వెబ్ డెస్క్: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ అసెంబ్లీ ఎన్నికల తర్వాతి కథ అంటూ ‘‘పవర్ స్టార్’’ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. దానికి కౌంటర్‌గా పవర్ స్టార్ అభిమానులు కూడా ఆర్జీవీ జీవిత చరిత్రపై ‘‘పరాన్న జీవి’’ అనే సినిమా తెరకెక్కిస్తున్నారు. పవన్ కళ్యాణ్ వీరాభిమాని, ‘బిగ్ బాస్’ సీజన్ 2 కంటెస్టెంట్ నూతన్ నాయుడు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. వర్మ చేస్తున్న ‘పవర్ స్టార్’ సినిమాకు పోటీగా ఈ ‘పరాన్నజీవి’ సినిమాను రిలీజ్ చేయాలని పవన్ కళ్యాణ్ అభిమానులు భావిస్తున్నారు.

అయితే రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న ‘పవర్ స్టార్’ చిత్రాన్ని జులై 24న విడుదల చేయాలని ఫిక్స్ అయ్యాడు. అయితే అదే రోజు ‘పరాన్న జీవి’ సినిమాను కూడా రిలీజ్ చేయాలని పవన్ అభిమానులు చూస్తున్నారు. అయితే పవర్ స్టార్‌కు వ్యతిరేకంగా వస్తున్న ఈ చిత్రంలో శ్రీ రెడ్డిని నటించాలని కోరారు దర్శక నిర్మాతలు. ఈమె నటిస్తుందనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు దీనిపై శ్రీ రెడ్డి స్పందించింది. తనను ‘పరాన్నజీవి’లో నటించాలని అడిగారని, కానీ ఆ ఆఫర్‌ను తాను ఒప్పుకోలేదని శ్రీరెడ్డి స్పష్టం చేసిది. అంతేగాకుండా ‘ఐ లవ్ రామ్ గోపాల్ వర్మ.. నేనెందుకు చేస్తాను’ అని సమాధానం ఇచ్చింది. అంటే ‘పరాన్నజీవి’లో శ్రీ రెడ్డి ప్రస్తావన తీసుకొస్తున్న విషయం నిజమే అయ్యుండొచ్చు. కానీ ఈమె మాత్రం నటించబోనని చెప్పింది. మరోవైపు పవర్ స్టార్ సినిమాలో కూడా శ్రీ రెడ్డి పాత్ర ఉంటుందని ప్రచారం జరుగుతుంది. చివరగా ఎవరి సినిమా ఎవరిపై ప్రభావం చూపుతుందో వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News