పేదల ఆకలి తీర్చడం మనందరి బాధ్యత : రాశీఖన్నా

దిశ ప్రతినిధి, హైదరాబాద్: కరోనా సమయంలో పేద ప్రజల ఆకలి తీర్చేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ప్రముఖ హీరోయిన్ రాశీ ఖన్నా అన్నారు. ఈ మేరకు గురువారం నాంపల్లి నిలోఫర్ ఆస్పత్రి సమీపంలోని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి బహుగుణ ఆధ్వర్యంలో హైదరాబాద్ రోటి బ్యాంక్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో పేద రోగులకు భోజనం, పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి రాశీ ఖన్నా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కరోనా కారణంగా పేద, […]

Update: 2021-06-10 08:26 GMT

దిశ ప్రతినిధి, హైదరాబాద్: కరోనా సమయంలో పేద ప్రజల ఆకలి తీర్చేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ప్రముఖ హీరోయిన్ రాశీ ఖన్నా అన్నారు. ఈ మేరకు గురువారం నాంపల్లి నిలోఫర్ ఆస్పత్రి సమీపంలోని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి బహుగుణ ఆధ్వర్యంలో హైదరాబాద్ రోటి బ్యాంక్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో పేద రోగులకు భోజనం, పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి రాశీ ఖన్నా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కరోనా కారణంగా పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. పేద ప్రజలకు సహాకరించేందుకు ప్రతీ ఒక్కరూ ముందుకు రావాలని అది మనం అందరి బాధ్యత అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నాంపల్లి ఇన్‌స్పెక్టర్ ఖలీల్ పాషా తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News