డ్రగ్స్ ఎవరు వాడుతున్నారో… తెలిసినా చెప్పను : మాధవీలతా
దిశ, వెబ్‌డెస్క్: సినీ నటి మాధవీలతా మరోసారి టాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల టాలీవుడ్‌లో పార్టీల్లో డ్రగ్స్ వాడుతున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మాధవీలతా, మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్‌లో పార్టీల్లో చాలాకాలంగా డ్రగ్స్ వాడుతున్నారని అన్నారు. ఐదేళ్ల క్రితం నేను హాజరైన కొన్ని పార్టీల్లోనూ డ్రగ్స్ వాడారని తెలిపారు. నేరమని తెలిసినా, వాడుతున్నారని అన్నారు. బాధ్యత గల పౌరురాలిని కాబట్టే ధైర్యంగా మాట్లాడుతున్నానని వెల్లడించారు. అంతేగాకుండా ఇండస్ట్రీలో ఎవరు డ్రగ్స్ వాడుతున్నారో తనకు […]
దిశ, వెబ్‌డెస్క్: సినీ నటి మాధవీలతా మరోసారి టాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల టాలీవుడ్‌లో పార్టీల్లో డ్రగ్స్ వాడుతున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మాధవీలతా, మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్‌లో పార్టీల్లో చాలాకాలంగా డ్రగ్స్ వాడుతున్నారని అన్నారు. ఐదేళ్ల క్రితం నేను హాజరైన కొన్ని పార్టీల్లోనూ డ్రగ్స్ వాడారని తెలిపారు. నేరమని తెలిసినా, వాడుతున్నారని అన్నారు.
బాధ్యత గల పౌరురాలిని కాబట్టే ధైర్యంగా మాట్లాడుతున్నానని వెల్లడించారు. అంతేగాకుండా ఇండస్ట్రీలో ఎవరు డ్రగ్స్ వాడుతున్నారో తనకు తెలసని, కానీ పేరు చెప్పనని అన్నారు. దీనిపై తెలంగాణ ఎన్సీబీ అధికారులు టాలీవుడ్‌పై దృష్టి సారించాలని తెలిపారు. సంచలనం కోసం తాను మాట్లాడటం లేదని మాధవీలతా వివరించారు.