విద్యార్థులకు ‘సోనూ స్కాలర్ షిప్’..!
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ ప్రముఖ నటుడు సోనూసూద్ కష్టాల్లో ఉన్నవారికి నేనున్నానంటూ ఆపన్నహస్తం అందిస్తున్నాడు. కరోనా విపత్కర సమయంలో కూలీలను వారి గమ్యస్థానాలకు చేర్చడమే కాకుండా, ఆన్ లైన్ తరగతుల కోసం విద్యార్థులకు సెల్‌ఫొన్స్, కాడెద్దులు మృత్యువాత పడితే ఓ రైతు కుటుంబానికి ట్రాక్టర్ కొనిచ్చిన ఘటనలన్నీ సోనూ దయా హృదయాన్ని చెప్పకనే చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సోనూసూద్ విద్యార్థుల కోసం మరో కార్యక్రమాన్ని తీసుకొచ్చాడు. తాజాగా పేద విద్యార్థుల కోసం ఓ ప్రత్యేక స్కాలర్ షిప్ […]
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ ప్రముఖ నటుడు సోనూసూద్ కష్టాల్లో ఉన్నవారికి నేనున్నానంటూ ఆపన్నహస్తం అందిస్తున్నాడు. కరోనా విపత్కర సమయంలో కూలీలను వారి గమ్యస్థానాలకు చేర్చడమే కాకుండా, ఆన్ లైన్ తరగతుల కోసం విద్యార్థులకు సెల్‌ఫొన్స్, కాడెద్దులు మృత్యువాత పడితే ఓ రైతు కుటుంబానికి ట్రాక్టర్ కొనిచ్చిన ఘటనలన్నీ సోనూ దయా హృదయాన్ని చెప్పకనే చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే సోనూసూద్ విద్యార్థుల కోసం మరో కార్యక్రమాన్ని తీసుకొచ్చాడు. తాజాగా పేద విద్యార్థుల కోసం ఓ ప్రత్యేక స్కాలర్ షిప్ ప్రొగ్రామ్‌ను రూపొందించాడు. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న అణగారిన వర్గాల విద్యార్థులకు స్కాలర్ షిప్ అందజేస్తానని ప్రకటించాడు. వార్షిక ఆదాయం రూ.2లక్షల లోపు ఉన్నకుటుంబాలకు చెందిన , మెరుగైన ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఇందుకు అర్హులుగా పేర్కొన్నాడు. అలాంటి వారు ఎవరైనా ఉంటే.. scholarships@sonusood.me మెయిల్ ఐడీకు 10రోజుల్లో వివరాలు పంపించాలని కోరాడు. కాగా, సోనూ ఈ ప్రకటన చేశాక పలువురు ప్రముఖులు, సినీ తారలు ఆయనకు అభినందనలు తెలిపారు.
Read Also…