ప్రముఖ నటుడి మృతికి కారణం డ్రగ్స్!

దిశ, వెబ్‌డెస్క్: తన నటనతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ అమెరికా నటుడు మైఖేల్ కె. విలియమ్స్ మృతికి కారణమేంటి అనేది సంబంధిత అధికారి వెల్లడించారు. ఈ విషయమై న్యూయార్క్ నగర కార్యాలయం చీఫ్ మెడికల్ ఎగ్జామినర్ ఓ ప్రకటన విడుదల చేశారు. విలియమ్స్ మృతికి కారణం డ్రగ్స్ అని, డ్రగ్స్‌ ఓవర్‌ డోస్‌ వల్లే విలియమ్స్ చనిపోయినట్లు ప్రాథమిక పరీక్షల్లో నిర్ధారణ అయ్యిందని పేర్కొన్నారు. 22 ఏళ్ల వయస్సులో ప్రొఫెషనల్‌ డ్యాన్సర్‌గా సినిమా రంగంలోకి […]

Update: 2021-09-24 23:54 GMT
దిశ, వెబ్‌డెస్క్: తన నటనతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ అమెరికా నటుడు మైఖేల్ కె. విలియమ్స్ మృతికి కారణమేంటి అనేది సంబంధిత అధికారి వెల్లడించారు. ఈ విషయమై న్యూయార్క్ నగర కార్యాలయం చీఫ్ మెడికల్ ఎగ్జామినర్ ఓ ప్రకటన విడుదల చేశారు. విలియమ్స్ మృతికి కారణం డ్రగ్స్ అని, డ్రగ్స్‌ ఓవర్‌ డోస్‌ వల్లే విలియమ్స్ చనిపోయినట్లు ప్రాథమిక పరీక్షల్లో నిర్ధారణ అయ్యిందని పేర్కొన్నారు.
22 ఏళ్ల వయస్సులో ప్రొఫెషనల్‌ డ్యాన్సర్‌గా సినిమా రంగంలోకి అడుగుపెట్టి సుమారు 50 కిపైగా మ్యూజిక్‌ వీడియోలు చేసి, ఆ తర్వాత 1996లో ‘బుల్లెట్‌’ మూవీ ద్వారా సినిమాల్లోకి అడుగుపెట్టాడు. ఓవైపు సినిమాల్లో, మరోవైపు బుల్లితెరపై రాణించి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆయన నటనకు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సైతం ఫిదా అయ్యారు. అతను పోషించిన పలు పాత్రలకు అత్యంత ప్రతిష్టాత్మక అవార్డులు కూడా వచ్చాయి. అయితే, భార్య చనిపోయాక విలియమ్స్ డ్రగ్స్‌కు బానిసైనట్లు ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావనకు వచ్చిన విషయం తెలిసిందే.
Tags:    

Similar News