మరియమ్మ లాకప్ డెత్ కేసులో పడిన మరో వికెట్
దిశ ప్రతినిధి, నల్లగొండ : యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడురు పోలీస్‌స్టేషన్ లాకప్ డెత్ కేసును ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్‌గా తీసుకున్న విషయం తెలిసిందే. దళిత మహిళ మరియమ్మ మృతికి గల బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డిని సైతం సీఎం ఆదేశించారు. అంతేకాకుండా స్టేషన్‌ను సందర్శించాలని కూడా కోరారు. మరియమ్మ లాకప్ డెత్ కేసులో ఇప్పటికే అడ్డగూడూరు ఎస్ఐ మహేశ్‌తో పాటు మరో ఇద్దరు కానిస్టేబుల్స్‌పై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేయగా.. తాజాగా చౌటుప్పల్ […]
దిశ ప్రతినిధి, నల్లగొండ : యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడురు పోలీస్‌స్టేషన్ లాకప్ డెత్ కేసును ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్‌గా తీసుకున్న విషయం తెలిసిందే. దళిత మహిళ మరియమ్మ మృతికి గల బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డిని సైతం సీఎం ఆదేశించారు. అంతేకాకుండా స్టేషన్‌ను సందర్శించాలని కూడా కోరారు.
మరియమ్మ లాకప్ డెత్ కేసులో ఇప్పటికే అడ్డగూడూరు ఎస్ఐ మహేశ్‌తో పాటు మరో ఇద్దరు కానిస్టేబుల్స్‌పై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేయగా.. తాజాగా చౌటుప్పల్ ఏసీపీ సత్తయ్యను రాచకొండ కమిషనరేట్‌కు అటాచ్ చేస్తూ సీపీ మహేశ్ భగవత్ ఉత్వర్వులు జారీచేశారు. ఆ స్థానంలో భువనగిరి ట్రాఫిక్ ఏసీపీ శంకర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు.