కోడెల విగ్రహావిష్కరణకు అచ్చెన్నాయుడు, దేవినేని దూరం

దిశ, ఏపీ బ్యూరో: గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం టీడీపీలో ముసలం నెలకొంది. సత్తెనపల్లిలో అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు విగ్రహావిష్కరణ విషయంలో వివాదం నెలకొంది. గురువారం కండ్లకుంటలో కోడెల విగ్రహావిష్కరణకు ఆయన తనయుడు కోడెల శివరాం ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావులు హాజరవుతారంటూ కోడెల శివరాం ఇప్పటికే ఆహ్వాన పత్రికలను సైతం పంపిణీ చేశారు. అయితే విగ్రహం ఏర్పాటుపై స్థానిక టీడీపీ నేతలు […]

Update: 2021-09-15 11:15 GMT

దిశ, ఏపీ బ్యూరో: గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం టీడీపీలో ముసలం నెలకొంది. సత్తెనపల్లిలో అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు విగ్రహావిష్కరణ విషయంలో వివాదం నెలకొంది. గురువారం కండ్లకుంటలో కోడెల విగ్రహావిష్కరణకు ఆయన తనయుడు కోడెల శివరాం ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావులు హాజరవుతారంటూ కోడెల శివరాం ఇప్పటికే ఆహ్వాన పత్రికలను సైతం పంపిణీ చేశారు. అయితే విగ్రహం ఏర్పాటుపై స్థానిక టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

శివరాం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆ కార్యక్రమానికి హాజరుకావద్దంటూ టీడీపీ నేతలకు స్థానిక నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో విగ్రహావిష్కరణకు వెళ్లకూడదని అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా హాజరుకాకుండా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సత్తెనపల్లిలో పార్టీ వివాదం పరిష్కారం అయ్యేలా దృష్టి పెడతానని అచ్చెన్నాయుడు తెలిపారు. త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News