వారికి అనుకూలంగా ఉంటే పోలీసులు మంచోళ్లా.. ఆరోపణలపై ఎస్ఐ ఆగ్రహం
దిశ, అచ్చంపేట: మాజీ శాసనసభ్యులు, డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ వంశీకృష్ణ తనపై చేసిన ఆరోపణలు అవాస్తవమని అచ్చంపేట ఎస్ఐ ప్రదీప్ నాయక్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 30ఆగస్టు 2021 నాడు అచ్చంపేట శాసనసభ్యుడు గువ్వల బాలరాజును తిట్టి, బెదిరించారనే కంప్లైంట్ మీద క్రైమ్ నెంబర్ 99/2021 u/s 504, 506 ఐపీసీ సెక్షన్ కింద అచ్చంపేట పోలీస్ స్టేషన్లో కేసు అయ్యిందని ఆయన తెలిపారు. ఈ కేసులో వాయిస్ రికార్డింగ్, […]
దిశ, అచ్చంపేట: మాజీ శాసనసభ్యులు, డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ వంశీకృష్ణ తనపై చేసిన ఆరోపణలు అవాస్తవమని అచ్చంపేట ఎస్ఐ ప్రదీప్ నాయక్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 30ఆగస్టు 2021 నాడు అచ్చంపేట శాసనసభ్యుడు గువ్వల బాలరాజును తిట్టి, బెదిరించారనే కంప్లైంట్ మీద క్రైమ్ నెంబర్ 99/2021 u/s 504, 506 ఐపీసీ సెక్షన్ కింద అచ్చంపేట పోలీస్ స్టేషన్లో కేసు అయ్యిందని ఆయన తెలిపారు. ఈ కేసులో వాయిస్ రికార్డింగ్, కాల్ డేటా ద్వారా అతడు బోయిన కాశీనాథ్ గా గుర్తించడం జరిగిందని, ఈ విషయంలో సెప్టెంబర్ 2 న ఒకసారి నోటీసు ఇవ్వడం గురించి అతని స్వంతగ్రామం గోగ పసల్ పహాడ్ కి పంపగా అతడు లేనందుకు, అతని తండ్రికి మరియు సర్పంచ్ కి కేసు నమోదు అయిన విషయం గురించి చెప్పి రావడం జరిగిందన్నారు.
తర్వాత మరల నోటీస్ తీసుకొని అక్టోబర్ 3 న ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని, అతని తండ్రి వెంకటప్ప, సర్పంచ్ భీమ్ రెడ్డి, మరియు ఇద్దరు పెద్దమనుషులును, కాశీనాథుని విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఆ సమయంలో లోకల్ కాంగ్రెస్ నాయకులకు కూడా కలిసి చెప్పానని గుర్తు చేశారు. ఆ సమయంలో కాశీనాథుని తండ్రి ఎంతో బాధపడుతూ గతంలో కూడా దొంగతనాలు చేసి మా చేత లక్షల రూపాయలు దండగ కట్టించాడని, కొడుకుపై మా కళ్ల ముందే తండ్రి కొట్టడానికి వెళ్లాడని తెలిపారు. ఈ సంఘటన 10 రోజుల క్రితం జరిగిందని, అప్పుడు లేనిది, ఈ రోజు పోలీస్ వారిపైన డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ వంశీకృష్ణ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, కావున ప్రజలు ఈ తప్పుడు ఆరోపణలను నమ్మకూడదని పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
పోలీసులు ఎవ్వరికీ అనుకూలంగా పని చేయరని, చట్టం ప్రకారంగా మాత్రమే పని చేస్తామని, ఆరోపణలు చేసే వారిపై మేము చట్ట వ్యతిరేకంగా, ఇతర పార్టీ వారిపైన ఎవరిమీదనైన తప్పుడు కేసులు నమోదు చేసినట్లు ఉంటే చూపాలని, ఎప్పుడైనా ఇబ్బంది పెట్టామో చెప్పాలని తెలిపారు. మీ రాజకీయ లబ్ది కోసం పోలీస్ వ్యవస్థపై తప్పుడు మాటలు మాట్లాడకూడదని విజ్ఞప్తి చేశారు. పోలీసులు చట్టరీత్యా చర్యల్లో భాగంగా కేసులు పెట్టడం, అరెస్ట్ చేయడం, స్టేషన్ బైల్ ఇవ్వడం చేయవచ్చు. పై కేసు విషయంలో స్టేషన్ బైల్ ఇవ్వడం జరిగింది. అంతే తప్ప మేము చట్టవ్యతిరేక చర్యలు చేయలేదని, ఎవ్వరిని క్యాంప్ ఆఫీస్ కి తీసుకు పోలేదని ఆయన తెలిపారు.
10 రోజుల క్రితం జరిగిన విషయాన్ని కావాలని రాజకీయ కట్టుకథగా మార్చి కావాలని మాట్లాడడం సబబు కాదని, ఈ విషయం అంతా కూడా వంశీ కృష్ణకు తెలుసని, ఆ రోజు నాతో మాట్లాడారని, మరి తప్పు ఉండి ఉంటే ఆ రోజు ఎందుకు అడగలేదని, శాంతి భద్రతల విషయంలో మేము చట్టపరంగా కఠినంగా పనిచేస్తాం అన్నారు. మీకు అనుకూలంగా జరిగితే పోలీస్ వారు మంచివాళ్ళు, ఏదైనా వ్యతిరేకంగా జరిగితే తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని, అందుకు మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. కావున పైన చేస్తున్న తప్పుడు ఆరోపణలను ఎవ్వరు నమ్మకూడదని ఎస్సై విజ్ఞప్తి చేశారు.