యువతిపై కత్తితో దాడి.. అంతలోనే నిందితుడి పరిస్థితి విషమం

దిశ, కంటోన్మెంట్: ప్రేమ పేరుతో ఉన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమించలేదన్న కారణంతో ఓ యువతిపై కత్తితో దాడి చేసి, తనను తాను పొడుచుకున్నాడు. ఈ ఘటనలో యువతికి స్వల్ప గాయాలవ్వగా, యువకుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు. బోయిన్‌పల్లిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. దమ్మాయిగూడకు చెందిన దినేష్(23) అనే యువకుడు బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో న్యూ బోయిన్‌పల్లిలోని బాపూజీనగర్‌కు వచ్చాడు. స్థానికంగా నివాసం […]

Update: 2021-08-04 04:56 GMT

దిశ, కంటోన్మెంట్: ప్రేమ పేరుతో ఉన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమించలేదన్న కారణంతో ఓ యువతిపై కత్తితో దాడి చేసి, తనను తాను పొడుచుకున్నాడు. ఈ ఘటనలో యువతికి స్వల్ప గాయాలవ్వగా, యువకుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు. బోయిన్‌పల్లిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. దమ్మాయిగూడకు చెందిన దినేష్(23) అనే యువకుడు బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో న్యూ బోయిన్‌పల్లిలోని బాపూజీనగర్‌కు వచ్చాడు. స్థానికంగా నివాసం ఉంటున్న యువతి(22) ఇంటికి వెళ్లి, బయటకు పిలిచాడు. వెంటనే ఆమెపై కత్తితో దాడికి తెగబడ్డాడు. అనంతరం తనకు తాను కత్తితో పొడుచుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు అరుపులు కేకలు వేసి, యువతిని బాలా‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వైద్యం కోసం తరలించారు. ఆ యువకుడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు.

Tags:    

Similar News