'వట్టిది కాదు పోతులూరి కాలజ్ఞానం'

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం పల్లెటూర్లలో ఏ నోట విన్నా కూడా ఇదే మాట.. అంతెందుకు పట్నంల కూడా కొంతమంది ఇదే అంశంపై మాట్లాడుకుంటున్నారు. ఆయన చెప్పింది నిజమే.. అందుకు ఉదాహరణ ప్రస్తుత పరిస్థితులే అని వాళ్లు ముచ్చట్లు పెడుతున్నారు. అదేమిటో మీరే చూడండి. ప్రస్తుతం యావత్ ప్రపంచమే గజగజ వణికిపోతోంది. ఒకే ఒక వైరస్ కరోనాతో మానవాళి అంతా అయోమయమవుతోంది. భూభాగాన ఎప్పుడు ఏ మూలన ఏం జరుగుతుందో అర్థంకావడంలేదు. దీంతో యావత్ ప్రపంచే ఈ […]

Update: 2020-03-28 06:31 GMT

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం పల్లెటూర్లలో ఏ నోట విన్నా కూడా ఇదే మాట.. అంతెందుకు పట్నంల కూడా కొంతమంది ఇదే అంశంపై మాట్లాడుకుంటున్నారు. ఆయన చెప్పింది నిజమే.. అందుకు ఉదాహరణ ప్రస్తుత పరిస్థితులే అని వాళ్లు ముచ్చట్లు పెడుతున్నారు. అదేమిటో మీరే చూడండి.

ప్రస్తుతం యావత్ ప్రపంచమే గజగజ వణికిపోతోంది. ఒకే ఒక వైరస్ కరోనాతో మానవాళి అంతా అయోమయమవుతోంది. భూభాగాన ఎప్పుడు ఏ మూలన ఏం జరుగుతుందో అర్థంకావడంలేదు. దీంతో యావత్ ప్రపంచే ఈ మహమ్మారి వైరస్ పై యుద్ధం చేస్తున్నాయి. చివరకు ఆ వైరస్ గెలుస్తుందో లేదా మనం గెలుస్తామో తెలియని పరిస్థితి నెలకొన్నది. దీంతో ప్రస్తుతం పల్లెటూర్లలో జనాలు ఆయన ప్రస్తావనే యాదికి తెచ్చుకుంటున్నారు.

విషయమేమిటంటే.. కరోనా కారణంగా ప్రపంచమంతా భయాందోళన చెందుతున్న విషయం తెలిసిందే. ఎందుకంటే .. ప్రపంచ దేశాలను చుట్టిన కరోనా వైరస్ మన దేశ గడపను తొక్కి, ఇప్పుడది విలయతాండవ చేస్తున్నది. దీంతో అది ఎప్పుడు ఏ రూపంలో తమను చేరి చంపేస్తుందోనని ప్రతి ఒక్కరిలో అంతర్ భయం నెలకొన్నది. దీంతో ప్రతి ఒక్కరూ దాని కోరలకు చిక్కకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మహమ్మారి కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే.. రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రస్తుతం పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దీంతో పల్లెటూర్లలో జనాలు పోతులూరి బ్రహ్మంగారిని గుర్తుకు చేసుకుంటున్నారు. వట్టిది కాదు పోతులూరి కాలజ్ఞానం అంటూ ఆయన చెప్పిన కాలజ్ఞానాన్ని మరోసారి నెమరవేసుకుంటున్నారు. ఆయన చెప్పిన విధంగా గతంలో కొన్ని అంశాలు జరిగాయని, ఇప్పుడు కూడా జరుగుతున్నదంటూ పల్లెవాసులు గుర్తు చేసుకుంటున్నారు. ఇక ముందు ఇంకేమీ జరుగునో అర్థంకావడంలేదంటూ చెవులు కొరుక్కుంటున్నారు.

Tags:    

Similar News