బ్రేకింగ్.. తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్ : తిరుమలను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాల ధాటికి తిరుమల ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. బుధవారం ఉదయంలో ఘాట్ రోడ్డు కొండ చరియలు, చెట్లు విరిగిపడ్డాయి. వరద ప్రవాహం ధాటికి రోడ్డుకు కోత పడటం, కొండ చరియల కారణంగా తిరుమల రెండో కనుమ దారి చివరి మలుపు వద్ద రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. ఆ సమయంలో రోడ్డుపై వాహనాలు లేకపోవడంలో భారీ ప్రమాదం తప్పింది. ఈ […]
దిశ, వెబ్‌డెస్క్ : తిరుమలను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాల ధాటికి తిరుమల ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. బుధవారం ఉదయంలో ఘాట్ రోడ్డు కొండ చరియలు, చెట్లు విరిగిపడ్డాయి. వరద ప్రవాహం ధాటికి రోడ్డుకు కోత పడటం, కొండ చరియల కారణంగా తిరుమల రెండో కనుమ దారి చివరి మలుపు వద్ద రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. ఆ సమయంలో రోడ్డుపై వాహనాలు లేకపోవడంలో భారీ ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఘాట్ రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది.
దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. టీటీడీ అధికారులు, సిబ్బంది రోడ్డు పునరుద్దరణ పనులను ప్రారంభించారు. ఈ క్రమంలో రోడ్డు తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు తెలిపారు. ఈ మార్గంలో వెళ్లే వాహనాలను మరో రోడ్డుకు డైవర్ట్ చేశారు.
Read more : శ్రీవారి భక్తులకు సూచన.. దర్శనాలు వాయిదా వేసుకోండి
Heavy accident on Second Ghat Road.
Road destroyed in two areas due to landslides,
Diverting the vehicles into First Ghat Road over Link Road#Tirupati #Tirumala #TirupatiYaaYo pic.twitter.com/mp4YK6cYm8— TirupatiYaaYo (@TirupatiYaaYo) December 1, 2021