యాదగిరిగుట్టలో ఏసీబీ దాడులు

దిశ ప్రతినిధి, నల్లగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు జరిగాయి. ఈ సోదాల్లో డాక్యుమెంట్ రైటర్ ద్వారా డబ్బులు తీసుకుంటూ సబ్ రిజిస్టార్ దేవానంద్ ఏసీబీకి చిక్కారు. ఓ వెంచర్ విషయంలో డాక్యుమెంట్ రైటర్ ద్వారా సబ్ రిజిస్ట్రార్ దేవానంద్ డబ్బులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బాధితులు ఏసీబీని ఆశ్రయించడంతో పక్కా ప్రణాళికతో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా  డాక్యుమెంట్ రైటర్ ప్రభాకర్‌ను రెడ్ […]

Update: 2021-07-29 07:06 GMT

దిశ ప్రతినిధి, నల్లగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు జరిగాయి. ఈ సోదాల్లో డాక్యుమెంట్ రైటర్ ద్వారా డబ్బులు తీసుకుంటూ సబ్ రిజిస్టార్ దేవానంద్ ఏసీబీకి చిక్కారు. ఓ వెంచర్ విషయంలో డాక్యుమెంట్ రైటర్ ద్వారా సబ్ రిజిస్ట్రార్ దేవానంద్ డబ్బులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బాధితులు ఏసీబీని ఆశ్రయించడంతో పక్కా ప్రణాళికతో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా డాక్యుమెంట్ రైటర్ ప్రభాకర్‌ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ సోదాల్లో డాక్యుమెంట్ రైటర్ ప్రభాకర్, సబ్ రిజిస్ట్రార్ దేవానంద్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Tags:    

Similar News