అచ్చంపేటలో ఏసీబీ విచారణ

దిశ ప్రతినిధి, మెదక్ : మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు చెందిన జమున హేచరీస్‌లో విచారణ ఇంకా కొనసాగుతోంది. మంగళవారం విచారణ కోసం మాసాయిపేట మండలం అచ్చంపేటలోని జమున హేచరీస్ కు ఉదయం ఏసీబీ రెవెన్యూ, పంచాయతీ అధికారులు వచ్చారు. అక్కడ తనిఖీలు నిర్వహించాలని హేచరీస్ సిబ్బందికి తెలిపారు. అయితే అందుకు హెచ్చరిస్ సిబ్బంది ఒప్పుకోలేదు. అధికారులు పలుమార్లు విచారణకు సహకరించాలని కోరగా చివరకు సర్వేయర్ లక్ష్మీ సుజాతను అనుమతించారు. కేవలం అర గంటలో విచారణ ముగించుకొని […]

Update: 2021-05-04 10:05 GMT

దిశ ప్రతినిధి, మెదక్ : మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు చెందిన జమున హేచరీస్‌లో విచారణ ఇంకా కొనసాగుతోంది. మంగళవారం విచారణ కోసం మాసాయిపేట మండలం అచ్చంపేటలోని జమున హేచరీస్ కు ఉదయం ఏసీబీ రెవెన్యూ, పంచాయతీ అధికారులు వచ్చారు. అక్కడ తనిఖీలు నిర్వహించాలని హేచరీస్ సిబ్బందికి తెలిపారు. అయితే అందుకు హెచ్చరిస్ సిబ్బంది ఒప్పుకోలేదు. అధికారులు పలుమార్లు విచారణకు సహకరించాలని కోరగా చివరకు సర్వేయర్ లక్ష్మీ సుజాతను అనుమతించారు. కేవలం అర గంటలో విచారణ ముగించుకొని వెళ్లారు.

అధికారులను అడ్డుకున్న సిబ్బంది…

హేచరీస్ కోసం నిర్మించిన షెడ్లను పరిశీలించాలని అధికారులు కోరారు. కానీ అందుకు హేచరీస్ సిబ్బంది ఒప్పుకోలేదు. లోపలికి ఎవరూ రాకుండా అడ్డుకుని గేటుకు తాళం వేశారు. దీంతో హేచరీస్ దగ్గరకు వచ్చిన ముగ్గురు ఏసీబీ ఇన్స్ స్పెక్టర్లు, డివిజన్ సర్వేయర్ లక్ష్మీసూజాత, మండల పంచాయతీ అధికారి, గ్రామ కార్యదర్శులు బయటే ఉన్నారు. కరోనా ఉధృతి కారణంగా హేచరీస్ లోపలికి ఎవరినీ అనుమతించమని తేల్చి చెప్పారు. హేచరీస్ లోపలికి అందరు రావడం వలన కోళ్లు చనిపోతాయని విచారణకు వచ్చిన అధికారుల బృందానికి వివరించారు.

చివరకు సర్వేయర్ లక్ష్మీసూజాతతో పాటు వారి సిబ్బందిని లోపలికి అనుమతించారు. షెడ్ల నిర్మాణం, ఒక్కో షెడ్డు ఎంత విస్తీర్ణంలో కట్టారు, షెడ్ల వెనక వైపు నిర్మిస్తున్న రోడ్డును పరిశీలించారు. అందులో ఉన్న పట్టా భూమి ఎంత ..? ప్రభుత్వ భూమి ఎంత అన్నదాని పై సర్వే నిర్వహించారు. కొద్ది సేపు హేచరీస్ షెడ్ల లోపల తనిఖీలు, సర్వే నిర్వహించారు. అనంతరం మాసాయిపేట తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లిన ఏసీబీ ఇన్స్‌పెక్టర్లు అక్కడ అచ్చంపేట, హకీంపేట గ్రామాలకు సంబంధించిన భూరికార్డులను పరిశీలించారు.

Tags:    

Similar News