ఏసీబీ కోర్టులో రేవంత్ రెడ్డికి చుక్కెదురు
దిశ, క్రైమ్ బ్యూరో : రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనాత్మకమైన ఓటుకు నోటు కేసులో ఎంపీ రేవంత్ రెడ్డికి ఏసీబీ కోర్టులో శుక్రవారం చుక్కెదురయ్యింది. గత ఐదేండ్లుగా కేసు విచారణ కొనసాగుతుండగా.. ప్రజా ప్రతినిధుల కేసుల సత్వర పరిష్కారానికి ప్రత్యేక విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈ కేసు ఏసీబీ కోర్టు పరిధిలోకి రాదంటూ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అంతే కాకుండా, ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న సంఘటన కావడంతో ఈ కేసు ఎన్నికల కమిషన్ […]
దిశ, క్రైమ్ బ్యూరో : రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనాత్మకమైన ఓటుకు నోటు కేసులో ఎంపీ రేవంత్ రెడ్డికి ఏసీబీ కోర్టులో శుక్రవారం చుక్కెదురయ్యింది. గత ఐదేండ్లుగా కేసు విచారణ కొనసాగుతుండగా.. ప్రజా ప్రతినిధుల కేసుల సత్వర పరిష్కారానికి ప్రత్యేక విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈ కేసు ఏసీబీ కోర్టు పరిధిలోకి రాదంటూ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అంతే కాకుండా, ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న సంఘటన కావడంతో ఈ కేసు ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తోందంటూ రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాది వాదించారు. ఈ విషయంపై పలుమార్లు విచారణ కొనసాగింది. చివరకు రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటీషన్ శుక్రవారం ఏసీబీ కోర్టు కొట్టివేసింది.
బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో..
బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో ఏ1 నిందితురాలు అఖిల ప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్ తీర్పు శనివారానికి వాయిదా పడింది. ఈ కేసులో అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్, సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డిలు ఇంకా పరారీలో ఉన్నారు. దీంతో జగత్ విఖ్యాత్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వొద్దంటూ పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. అయితే, సికింద్రాబాద్ సెషన్స్ కోర్టు ఈ పిటీషన్ పై తీర్పును శనివారం నాటికి వాయిదా వేసింది. ముందస్తు బెయిల్ ను ఇప్పటికే అఖిల భర్త భార్గవ్ కు కోర్టు తిరస్కరించగా.. జగత్ విఖ్యాత్ రెడ్డికి ముందస్తు బెయిల్ వస్తోందా.. రాదో చూడాలి.