బాబు అక్రమాస్తుల కేసు విచారణ వాయిదా

దిశ, వెబ్‎డెస్క్: కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో పలు కోర్టుల కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి. శుక్రవారం టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమాస్తులకేసును విచారించిన ఏసీబీ కోర్టు.. వాదనలు విన్న తర్వాత కేసును ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది. ప్రజాప్రతినిధుల కేసుల విచారణలో భాగంగా ఏసీబీ కోర్టు విచారణ వేగవంతం చేసింది. దీంతో చంద్రబాబు ఆస్తుల కేసు తెరపైకి వచ్చింది. 2004 ఎన్నికల అఫిడవిట్‎లో చంద్రబాబు చూపిన ఆస్తులపై ఏసీబీకి ఫిర్యాదు చేసిన లక్ష్మీ పార్వతి […]

Update: 2020-10-09 07:45 GMT

దిశ, వెబ్‎డెస్క్: కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో పలు కోర్టుల కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి. శుక్రవారం టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమాస్తులకేసును విచారించిన ఏసీబీ కోర్టు.. వాదనలు విన్న తర్వాత కేసును ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది. ప్రజాప్రతినిధుల కేసుల విచారణలో భాగంగా ఏసీబీ కోర్టు విచారణ వేగవంతం చేసింది. దీంతో చంద్రబాబు ఆస్తుల కేసు తెరపైకి వచ్చింది. 2004 ఎన్నికల అఫిడవిట్‎లో చంద్రబాబు చూపిన ఆస్తులపై ఏసీబీకి ఫిర్యాదు చేసిన లక్ష్మీ పార్వతి నుంచి చంద్రబాబు స్టే తెచ్చుకున్నారు. అయితే పెండింగ్‌లో ఉన్న స్టేలు ఎత్తేయాలని సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయంతో ఇటీవల చంద్రబాబు స్టే ఎత్తేశారు.

Tags:    

Similar News