12 తహసీల్దార్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు

దిశ, ఏపీ బ్యూరో: విశాఖపట్నంలో ఏసీబీ అధికారుల తనిఖీలు కలకలం రేపుతున్నాయి. జిల్లాలోని 12 తహసీల్దార్ కార్యాలయాలపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ 12 కార్యాలయాలపై అవినీతి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దాడులు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో ఏసీబీ అధికారులు అన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. రెండు రోజులపాటు ఈ సోదాలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. విజయనగరంలోనూ ఏసీబీ దాడులు మరోవైపు విజయనగరం జిల్లాలోనూ ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఏడు […]

Update: 2021-07-20 05:38 GMT

దిశ, ఏపీ బ్యూరో: విశాఖపట్నంలో ఏసీబీ అధికారుల తనిఖీలు కలకలం రేపుతున్నాయి. జిల్లాలోని 12 తహసీల్దార్ కార్యాలయాలపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ 12 కార్యాలయాలపై అవినీతి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దాడులు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో ఏసీబీ అధికారులు అన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. రెండు రోజులపాటు ఈ సోదాలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

విజయనగరంలోనూ ఏసీబీ దాడులు

మరోవైపు విజయనగరం జిల్లాలోనూ ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఏడు తహసీల్దార్ కార్యాలయాల్లో ఏక కాలంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. భూముల ధరలు అధికంగా ఉన్న భోగాపురం, పూసపాటిరేగ, డెంకాడ, నెల్లిమర్ల, కొత్తవలస, ఎస్.కోట, జామి తహసీల్దార్ కార్యాలయాల్లో మంగళవారం ఉదయం నుంచి దాడులు చేపట్టారు. కార్యాలయంతో పాటు తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ కార్లను కూడా తనిఖీ చేపట్టారు. ఈ దాడుల్లో పలు కీలకపాత్రలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.

ఆంధ్రప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖను ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. మరికొన్ని నెలల్లో రాజధానిని తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు కూడా చేస్తోంది. ఇలాంటి తరుణంలో తహసీల్దార్ కార్యాలయాలపై ఏసీబీ అధికారులు దాడులు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. భూముల అక్రమాలపైనే ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News