అచ్చెన్నాయుడిని విచారిస్తున్న ఏసీబీ
దిశ, ఏపీ బ్యూరో: ఈఎస్ఐ మందులు, పరికరాల కొనుగోళ్ల స్కాంలో టీడీపీ నేత అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు రెండో రోజు విచారిస్తున్నారు. విచారణకు ముందు ఆయనకు ఏండోస్కోపి పరిక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం ఆయనను జీజీహెచ్‌లోని పొదిలి ప్రసాద్ బ్లాక్‌కు తీసుకెళ్లారు. ఈ సమయంలో ఆయనతో పాటు అచ్చెన్నాయుడు తరపు న్యాయవాది, డాక్టర్ ఉన్నారు. వారి సమక్షంలోనే ఏసీబీ అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నారు. కాగా, నిన్న మూడు గంటల పాటు ఆయనను ప్రశ్నించిన ఏసీబీ అధికారులు ఈఎస్ఐ […]
దిశ, ఏపీ బ్యూరో: ఈఎస్ఐ మందులు, పరికరాల కొనుగోళ్ల స్కాంలో టీడీపీ నేత అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు రెండో రోజు విచారిస్తున్నారు. విచారణకు ముందు ఆయనకు ఏండోస్కోపి పరిక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం ఆయనను జీజీహెచ్‌లోని పొదిలి ప్రసాద్ బ్లాక్‌కు తీసుకెళ్లారు. ఈ సమయంలో ఆయనతో పాటు అచ్చెన్నాయుడు తరపు న్యాయవాది, డాక్టర్ ఉన్నారు. వారి సమక్షంలోనే ఏసీబీ అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నారు. కాగా, నిన్న మూడు గంటల పాటు ఆయనను ప్రశ్నించిన ఏసీబీ అధికారులు ఈఎస్ఐ స్కాంలో పలు వివరాలు సేకరించినట్టు తెలుస్తోంది.