కార్పొరేట్ కాలేజీలపై పీఎస్‌లో ఫిర్యాదు

దిశ, తెలంగాణ బ్యూరో: తప్పుడు ర్యాంకులతో సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్న కార్పొరేట్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్​లో మంగళవారం ఫిర్యాదు చేశారు. ఇటీవల ప్రకటించిన నీట్ ఫలితాల్లో తప్పుడు ర్యాంకులకు తెరలేపిన శ్రీ చైతన్య, ఆకాష్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎం.సుమన్ శంకర్ కోరారు. తల్లిదండ్రులను విద్యార్థులను తప్పుదారి పట్టించే విధంగా ప్రకటనలు చేయడం కార్పొరేట్ విద్యా సంస్థలకు కొత్తేమీ కాదని, తమ […]

Update: 2020-10-27 10:04 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తప్పుడు ర్యాంకులతో సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్న కార్పొరేట్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్​లో మంగళవారం ఫిర్యాదు చేశారు. ఇటీవల ప్రకటించిన నీట్ ఫలితాల్లో తప్పుడు ర్యాంకులకు తెరలేపిన శ్రీ చైతన్య, ఆకాష్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎం.సుమన్ శంకర్ కోరారు. తల్లిదండ్రులను విద్యార్థులను తప్పుదారి పట్టించే విధంగా ప్రకటనలు చేయడం కార్పొరేట్ విద్యా సంస్థలకు కొత్తేమీ కాదని, తమ విద్యార్థి కాకున్న తమ విద్యాసంస్థల్లో చదువకున్న ర్యాంకులు అన్ని మావే, మావే అంటూ ప్రచారం చేసుకోవడం సిగ్గుమాలిన చర్య అని వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News