ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం..

దిశ, తెలంగాణ బ్యూరో : ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని బీజేపీ అభ్యర్థి రాంచందర్ రావు ఆరోపించారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో తాను గెలుస్తానన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై వ్యతిరేకతతోనే బీజేపీకి ఓటు వేశారన్నారు. ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపడం పీఆర్సీ ఇస్తున్నట్లు ప్రకటించడం కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుందని ఆయన వివరించారు. ఈ ఎన్నికల్లో పూర్తిగా అధికార దుర్వినియోగం జరిగిందని, ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. పట్టభద్రుల ఎన్నికలలోనూ […]

Update: 2021-03-19 10:17 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని బీజేపీ అభ్యర్థి రాంచందర్ రావు ఆరోపించారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో తాను గెలుస్తానన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై వ్యతిరేకతతోనే బీజేపీకి ఓటు వేశారన్నారు. ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపడం పీఆర్సీ ఇస్తున్నట్లు ప్రకటించడం కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుందని ఆయన వివరించారు. ఈ ఎన్నికల్లో పూర్తిగా అధికార దుర్వినియోగం జరిగిందని, ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. పట్టభద్రుల ఎన్నికలలోనూ టీఆర్ఎస్ విచ్చలవిడిగా డబ్బులు పంచిందని, వివిధ సంఘాల నేతలతో మీటింగులు ఏర్పాటు చేసి ప్రజలను మోసం చేశారని తెలిపారు.

 

Tags:    

Similar News