ఆదిత్యా బిర్లా క్యాపిటల్ త్రైమాసిక లాభం 44 శాతం క్షీణత!

దిశ, వెబ్‌డెస్క్: ఆదిత్య బిర్లా క్యాపిటల్ శుక్రవారం 2019-20 ఆర్థిక సంవత్సరానికి చివరి త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. ఆర్థిక సంవత్సరానికి ఏకీకృత నికర లాభం 5.6 శాతం పెరిగి రూ. 920 కోట్ల రూపాయలకు చేరుకుంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది రూ. 871 కోట్ల రూపాయలు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఏకీకృత ఆదాయం 11 శాతం పెరిగి రూ. 18,028 కోట్ల రూపాయలుగా నమోదైందని ఆదిత్య బిర్లా క్యాపిటల్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. అలాగే, చివరి […]

Update: 2020-06-05 09:18 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆదిత్య బిర్లా క్యాపిటల్ శుక్రవారం 2019-20 ఆర్థిక సంవత్సరానికి చివరి త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. ఆర్థిక సంవత్సరానికి ఏకీకృత నికర లాభం 5.6 శాతం పెరిగి రూ. 920 కోట్ల రూపాయలకు చేరుకుంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది రూ. 871 కోట్ల రూపాయలు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఏకీకృత ఆదాయం 11 శాతం పెరిగి రూ. 18,028 కోట్ల రూపాయలుగా నమోదైందని ఆదిత్య బిర్లా క్యాపిటల్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. అలాగే, చివరి త్రైమాసికంలో ఏకీకృత నికర లాభంలో 44.4 శాతం క్షీణించి రూ. 143.67 కోట్లకు చేరుకుంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ. 258.40 కోట్లు. అయితే, సమీక్షీంచిన త్రైమాసికంలో ఆదాయం రూ. 5,122 కోట్లకు పెరిగింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ. 15 వేల కోట్లకు పైగా దీర్ఘకాలిక నిధులను సేకరించినట్లు కంపెనీ తెలిపింది.

Tags:    

Similar News