హిందీ వర్డ్ ఆఫ్ ది ఇయర్ .. ‘ఆత్మనిర్భరత’

దిశ, ఫీచర్స్ : కొవిడ్ రికవరీ ప్యాకేజ్‌పై ప్రధాని మోడీ ప్రసంగించిన తర్వాత ‘ఆత్మనిర్భరత’ అనే పదం ప్రజల్లోకి చొచ్చుకుపోయింది. ఈ పదాన్ని జనాలు విరివిగా ఉపయోగిస్తుండగా.. కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం సహా మహమ్మారి పోరులో సగటు మానవుల రోజువారీ విజయాలకు ఇది సాక్ష్యంగా నిలిచింది. ఈ క్రమంలో సెల్ఫ్ రిలయన్స్ (స్వయం ప్రతిపత్తి)ను సూచించే ‘ఆత్మనిర్భరత’ పదాన్ని ‘హిందీ వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2020’గా ఎంపిక చేసింది ఆక్స్‌ఫర్డ్. లాంగ్వేజ్ ఎక్స్‌పర్ట్స్ […]

Update: 2021-02-03 01:38 GMT

దిశ, ఫీచర్స్ : కొవిడ్ రికవరీ ప్యాకేజ్‌పై ప్రధాని మోడీ ప్రసంగించిన తర్వాత ‘ఆత్మనిర్భరత’ అనే పదం ప్రజల్లోకి చొచ్చుకుపోయింది. ఈ పదాన్ని జనాలు విరివిగా ఉపయోగిస్తుండగా.. కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం సహా మహమ్మారి పోరులో సగటు మానవుల రోజువారీ విజయాలకు ఇది సాక్ష్యంగా నిలిచింది. ఈ క్రమంలో సెల్ఫ్ రిలయన్స్ (స్వయం ప్రతిపత్తి)ను సూచించే ‘ఆత్మనిర్భరత’ పదాన్ని ‘హిందీ వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2020’గా ఎంపిక చేసింది ఆక్స్‌ఫర్డ్. లాంగ్వేజ్ ఎక్స్‌పర్ట్స్ కృతిక అగర్వాల్, పూనమ్ నిగం సహే, ఇమోజెన్ ఫాక్సెల్‌‌తో కూడిన సలహా బృందం ఎంపిక చేసింది.

ప్రతీ సంవత్సరం ఎక్కువగా ప్రాచుర్యం పొందిన, కొత్తగా వాడుకలోకి వచ్చిన ఇంగ్లిష్ పదాలను ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ వర్డ్ ఆఫ్‌ ద ఈయర్‌గా గుర్తిస్తుంది. గత సంవత్సరం కొవిడ్‌తో పాటు అమెరికాలో నల్ల జాతీయులపై వివక్ష నేపథ్యంలో అనేక కొత్త పదాలు(లాక్‌డౌన్, ఐసోలేషన్, క్వారంటైన్, సోషల్ డిస్టెన్సింగ్, అన్‌మ్యూట్, బ్లాక్ లైవ్స్ మ్యాటర్, క్యాన్సల్ కల్చర్) వాడుకలోకి వచ్చినందున వాటి నుంచి ఒకే ఒక్క పదాన్ని ఎంచుకోలేకపోయామని ఆ సంస్థ ‘డిసెంబర్’లోనే ప్రకటించింది. అయితే తాజాగా ఆక్స్‌ఫర్డ్ ‘హిందీ డిక్షనరీ వర్డ్ ఆఫ్ ది ఇయర్-2020’ పదంగా ‘ఆత్మనిర్భరత’ను ప్రకటించింది. ఆత్మనిర్భరత అనేది కేవలం పదం మాత్రమే కాక, గడిచిన సంవత్సరంలో దేశ నైతికత, మానసిక స్థైర్యాన్ని ప్రతిబింబించిందని ప్యానెల్ సభ్యులు పేర్కొన్నారు.

‘పాండెమిక్ సమయంలో భారతదేశంలో లక్షలాది మంది కొత్త జీవన విధానాలను అలవర్చుకున్నారు. 2020కి ముందు కన్నా వ్యక్తిగత స్వావలంబన పెరిగింది. హోమ్ స్కూలింగ్, రిమోట్ వర్కింగ్, ఆరోగ్యంపై వ్యక్తిగత శ్రద్ధ పెరగడం, ఆహారం మీద కేర్ తీసుకోవడం, సొంతంగా వంట చేసుకోవడం, ఫిజికల్ ఫిట్‌నెస్ పెంచుకోవడం, మనకు ప్రియమైన వారికి దూరంగా ఉండి వ్యక్తిగత పనులు చేసుకోవడం.. ఇలా ఎన్నో అంశాల్లో మనం సెల్ఫ్ రియలన్స్ నేర్చుకున్నాం’ అని లాంగ్వేజ్ ఎక్స్‌పర్ట్ అగర్వాల్ తెలిపారు.

ఇక ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ అంటే స్వయం ఆధారిత భారత్‌ కాగా స్థానిక ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తం చేయడంతో పాటు భారత్‌లో తయారీని ప్రోత్సహించడం ద్వారా భారత్‌ స్వయం శక్తిగా ఎదగడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఆర్థిక సాయం అందించడం, ప్రోత్సాహకాలు ఇవ్వడం, రుణాలు లభించేలా చూడటం, ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించడంతో పాటు దీర్ఘకాలిక సంస్కరణలు అమలు వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. మోదీ కరోనా ఉపశమన ప్యాకేజీ ప్రకటించిన అనంతరం ఆత్మనిర్భర భారత్, ఆత్మనిర్భరత పదాలు ప్రజాక్షేతంలో వాడుక పదాలుగా మారిపోయాయని ప్యానెల్ పేర్కొంది.

Tags:    

Similar News