ఆ ఇళ్లను జగన్ పేదలకు ఎందుకు ఇవ్వడం లేదు ?

దిశ, ఏపీ బ్యూరో: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 27 నెలలైంది. ఇప్పటి వరకు టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వలేకపోయారని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి ఆలపాటి రాజా విమర్శించారు. తమ ప్రభుత్వంలో నిర్మించిన ఇళ్లను అవినీతి, రివర్స్ టెండరింగ్ పేరుతో లబ్ధిదారులకు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. టిడ్కో ఇళ్లు ఏపీలోనే అతి తక్కువ ధరకు నిర్మించారని చెప్పుకొచ్చారు. పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఇళ్లు లేనివారికి సెంటు భూమి పేరుతో రాష్ట్రాన్ని వైసీపీ నేతలు కబ్జా […]

Update: 2021-08-24 06:52 GMT

దిశ, ఏపీ బ్యూరో: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 27 నెలలైంది. ఇప్పటి వరకు టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వలేకపోయారని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి ఆలపాటి రాజా విమర్శించారు. తమ ప్రభుత్వంలో నిర్మించిన ఇళ్లను అవినీతి, రివర్స్ టెండరింగ్ పేరుతో లబ్ధిదారులకు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు.

టిడ్కో ఇళ్లు ఏపీలోనే అతి తక్కువ ధరకు నిర్మించారని చెప్పుకొచ్చారు. పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఇళ్లు లేనివారికి సెంటు భూమి పేరుతో రాష్ట్రాన్ని వైసీపీ నేతలు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విరుచుకుపడ్డారు. 30 లక్షల పట్టాల పేరుతో అవినీతికి పాల్పడిన వైసీపీ నేతలు చరిత్రహీనులుగా మిగిలిపోతారని మాజీమంత్రి ఆలపాటి రాజా హెచ్చరించారు.

Tags:    

Similar News