గ్రామీణ యువకుడి స్మార్ట్ థింకింగ్.. బ్యాటరీ సైకిల్ తయారీ..
దిశ ప్రతినిధి, వరంగల్ : కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు.. మహా పురుషులవుతారు అన్న ఓ సినీ కవి మాటలను నిజం చేశాడు ఓ మెకానిక్. తను పడ్డ బాధలు ఇతరులు పడకూడదనే బాధ్యాతయుతమైన ఆలోచనతో గ్రామీణ ప్రాంతానికి చెందిన రాజు అనే యువకుడు బ్యాటరీతో నడిచే సైకిల్‌ను తయారు చేశాడు. రాజు తయారు చేసిన బ్యాటరీ సైకిల్ కేవలం రూ. 20వేలల్లో లభించడం విశేషం. వివరాల ప్రకారం.. వరంగల్ రూరల్ జిల్లాలోని దుగ్గోండి మండలం గోపాలపురం […]
దిశ ప్రతినిధి, వరంగల్ : కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు.. మహా పురుషులవుతారు అన్న ఓ సినీ కవి మాటలను నిజం చేశాడు ఓ మెకానిక్. తను పడ్డ బాధలు ఇతరులు పడకూడదనే బాధ్యాతయుతమైన ఆలోచనతో గ్రామీణ ప్రాంతానికి చెందిన రాజు అనే యువకుడు బ్యాటరీతో నడిచే సైకిల్‌ను తయారు చేశాడు. రాజు తయారు చేసిన బ్యాటరీ సైకిల్ కేవలం రూ. 20వేలల్లో లభించడం విశేషం.
వివరాల ప్రకారం.. వరంగల్ రూరల్ జిల్లాలోని దుగ్గోండి మండలం గోపాలపురం గ్రామానికి చెందిన రాజు ఓ టూల్ వర్క్‌షాప్ నడుపుతున్నాడు. తను వర్క్‌షాప్‌కు వెళ్లడానికి రోజూ 20 కిలోమీటర్ల దూరం ప్రయాణించేవాడు. ఇటీవలి కాలంలో పెట్రోల్ ధరలు బాగా పెరిగిపోవడంతో ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. తనలాగే ఇబ్బందులు పడుతున్న సామాన్య జనానికి ఈ బాధలను తప్పించాలని భావించాడు. బ్యాటరీతో నడిచే సైకిల్‌ను తయారు చేయాలని సంకల్పించి విజయం సాధించాడు.
అందరికీ అనుకూలంగా సోలార్, బ్యాటరీతో నడిచే ఓ ఎలక్ట్రిక్ సైకిల్‌ను తయారు చేశాడు. బ్యాటరీని ఫుల్‌గా ఛార్జ్ చేస్తే 20 కిలోమీటర్ల దూరం ప్రయాణించేలా తయారు చేశాడు. సైకిల్‌కు సోలార్ పానెల్ అమర్చి.. దాని ద్వారా బ్యాటరీ ఛార్జ్ అయ్యేలా రూపొందించాడు. బ్యాటరీ ఛార్జ్ అయిపోతే, సైకిల్‌కు ఉన్న పెడల్స్ ఉపయోగించి తిరిగి సైకిల్‌పై ప్రయాణించవచ్చు. సైకిల్ బ్యాటరీ తయారీకి రాజుకు అయిన ఖర్చు మొత్తం కేవలం రూ. 9000 కావడం గమనార్హం.