ఓరినీ… వాటికోసం 35 మందిని ప్రేమించడమేంటి?

దిశ, వెబ్ డెస్క్: ఈ కాలంలో ప్రేమ వ్యాపారం అయిపోయింది. బాయ్ ఫ్రెండ్ నుండి గిఫ్ట్ లు పొందడం కోసం ప్రేమ పేరు చెప్పి ఆడుకున్న అమ్మాయిలను చాలామందిని చూసే ఉంటాం.. ఇంకా, అమ్మాయి దగ్గర నుండి ఏదో ఆశించి అబ్బాయిలు వెంటపడుతున్నారు అనేది కూడా వినే ఉంటాం. కానీ ఇక్కడ మనం చెప్పుకుంటున్న ఒక వ్యక్తి వాళ్లందరికీ గురువులా ఉన్నాడు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 35 మందిని ఏకకాలంలో ప్రేమించాడు.. ఎందుకో తెలుసా? […]

Update: 2021-04-23 06:27 GMT

దిశ, వెబ్ డెస్క్: ఈ కాలంలో ప్రేమ వ్యాపారం అయిపోయింది. బాయ్ ఫ్రెండ్ నుండి గిఫ్ట్ లు పొందడం కోసం ప్రేమ పేరు చెప్పి ఆడుకున్న అమ్మాయిలను చాలామందిని చూసే ఉంటాం.. ఇంకా, అమ్మాయి దగ్గర నుండి ఏదో ఆశించి అబ్బాయిలు వెంటపడుతున్నారు అనేది కూడా వినే ఉంటాం. కానీ ఇక్కడ మనం చెప్పుకుంటున్న ఒక వ్యక్తి వాళ్లందరికీ గురువులా ఉన్నాడు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 35 మందిని ఏకకాలంలో ప్రేమించాడు.. ఎందుకో తెలుసా? బర్త్ డే గిఫ్ట్ ల కోసం. ఏంటి.. గిఫ్ట్ ల కోసం ప్రేమించాడా?.. అంటే అవును అందుకే ప్రేమించాడు.. చివరికి అతని కక్కుర్తి బుద్ది వల్లే ప్రస్తుతం కటకటాల్లో ఊచలు లెక్కేస్తున్నాడు. ప్రేమ పేరుతో 35 మంది యువతులను ఒక యువకుడు మోసం చేసిన ఘటన జపాన్ లో వెలుగుచూసింది.

జపాన్‌ దక్షిణ ప్రాంతానికి చెందిన తకాషి మియాగావా ఒక ప్రైవేట్ కంపెనీలో మార్కెటింగ్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు. ఇతగాడికి రిచ్ గా బతకాలని కోరిక. దీంతో ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసి వారిని ప్రేమలోకి దింపుతాడు. ఆ తర్వాత తన పుట్టినరోజు వస్తుందని, తనకు గిఫ్ట్ కావాలని ప్రేయసితో చెప్పి ఖరీదైన బట్టలు, వస్తువులను కొనుగోలు చేస్తాడు. ఇలా ఏకకాలంలో 35 మందితో ప్రేమాయణం నడిపాడు. ప్రతి ఒక్కరి దగ్గర ఫేక్ బర్త్ డే డేట్ చెప్పి గిఫ్ట్స్ కొట్టేసేవాడు. అంతే కాకుండా తన కంపెనీకి సంబంధించిన వస్తువులను కూడా వారితో కొనిపించేవాడు. కొన్ని రోజులు సజావుగానే సాగిన ఇతగాడి వ్యవహారం ఒక ప్రేయసి వలన బయట పడింది. తాము ప్రేమించిన అబ్బాయి గురుంచి తెలుసుకొని షాక్ అవ్వడం అమ్మాయిల వంతయ్యింది. వెంటనే యువతులు తకాషి మియాగావా తమను మోసం చేసాడని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగుచూసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తకాషి మియాగావా ని అరెస్ట్ చేశారు.

Tags:    

Similar News