ఏం తినకుండానే రూ.49,996 బిల్లు కట్టిన మహిళ

దిశ, వెబ్‌డెస్క్ : ఇంట్లోనే కూర్చొని కాలు కదపకుండా అన్ని పనులు చేసేస్తున్నారు నేటి యువత. అంతా ఆన్‌లైన్ మయం కావడంతో గుండు పిన్ నుండి లగ్జరీ కార్ల వరకు ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకుంటున్నారు. ఇక ఫుడ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసం లేదు. బ్రేక్ పాస్ట్ నుంచి డిన్నర్ వరకు ఆన్‌లైన్‌లోనే తినేస్తున్నారు. అయితే ఆన్‌లైన్ బుకింగ్స్, చెల్లింపులు, ఆయా సంస్థలు ఇచ్చే ప్రకటనల పట్ల అప్రమత్తం లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్ జీరో కావడం గ్యారెంటీ. అలాంటి […]

Update: 2020-12-28 11:42 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఇంట్లోనే కూర్చొని కాలు కదపకుండా అన్ని పనులు చేసేస్తున్నారు నేటి యువత. అంతా ఆన్‌లైన్ మయం కావడంతో గుండు పిన్ నుండి లగ్జరీ కార్ల వరకు ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకుంటున్నారు. ఇక ఫుడ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసం లేదు. బ్రేక్ పాస్ట్ నుంచి డిన్నర్ వరకు ఆన్‌లైన్‌లోనే తినేస్తున్నారు. అయితే ఆన్‌లైన్ బుకింగ్స్, చెల్లింపులు, ఆయా సంస్థలు ఇచ్చే ప్రకటనల పట్ల అప్రమత్తం లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్ జీరో కావడం గ్యారెంటీ. అలాంటి ఘటనే బెంగళూరులో ఓ మహిళకు జరిగింది.

బెంగళూరుకు చెందిన సవిత శర్మ ఫుడ్ ఆర్డర్ కోసం ఆన్‌లైన్‌లో వెతికింది. ఫేస్‌బుక్‌లో కనిపించిన ఓ ప్రకటన ఆమెను ఆకర్షించింది. ఒక ఫుడ్ ఆర్డర్ కు మరో ఫుడ్ ఆర్డర్ ఫ్రీ అని ఉండడంతో ఆమె ఆ ప్రకటనలో ఉన్న ఫోన్ నెంబర్ కు కాల్ చేసి రూ.250 విలువైన ఫుడ్ ఆర్డర్ చేసింది. అయితే ఫుడ్ డెలవరీకి ముందు రూ10 చెల్లించాలని, మిగతావి తర్వాత చెల్లించవచ్చని ఆర్డర్ తీసుకున్న వ్యక్తి చెప్పడంతో ఆ మాటలు నమ్మిన సవిత శర్మ.. అతడు పంపిన లింక్ ను ఓపెన్ చేసి అందులో తన డెబిట్ కార్డు వివరాలు నమోదు చేసింది. వాటితోపాటు పిన్ నంబర్ కూడా ఎంటర్ చేయడంతో వెంటనే ఆమె అకౌంట్ నుంచి రూ.49,996 నగదు విత్ డ్రా చేసినట్లు మెసేజ్ వచ్చింది. వెంటనే అవతలి వ్యక్తికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. తాను మోసపోయానని గ్రహించిన సవిత శర్మ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సైబర్ నేరంతో ఆమె ఏం తినకుండానే రూ.50 వేల వరకు బిల్లు కట్టినట్టయింది.

Tags:    

Similar News