అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
దిశ, మర్రిగూడ: అనుమానాస్పద స్థితిలో వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం మర్రిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండల కేంద్రంలోని 132/11kv సబ్ స్టేషన్ ఏఈ మాలోతు శ్రీనివాస్ నాయక్ భార్య సంపూర్ణ (29 ) శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఆ సమయంలో భర్త ఇంట్లో లేకపోవడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు గల కారణాలని పోలీసులు […]
దిశ, మర్రిగూడ: అనుమానాస్పద స్థితిలో వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం మర్రిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండల కేంద్రంలోని 132/11kv సబ్ స్టేషన్ ఏఈ మాలోతు శ్రీనివాస్ నాయక్ భార్య సంపూర్ణ (29 ) శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఆ సమయంలో భర్త ఇంట్లో లేకపోవడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు గల కారణాలని పోలీసులు అనుమానిస్తున్నారు. ఏఈ శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాస్‌కు సంపూర్ణతో సంవత్సరం క్రిందట వివాహం అయ్యింది. శ్రీనివాసు ది నేరేడుచర్ల. కాగా సంపూర్ణ స్వగ్రామం దేవరకొండ మండలంలోని తేల్ దేవరపల్లి గ్రామం. శ్రీనివాస్ తల్లిదండ్రులకు, అత్తమామలకు చరవాణి ద్వారా సమాచారం అందించినట్లు ఎస్సై నాగుల్ మీరా తెలిపారు.