భర్తను చంపిన భార్య… అమ్మకు సహకరించిన కొడుకులు

దిశ, నిజామాబాద్: జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మెడలో మూడు ముళ్లు వేసి అగ్ని సాక్షిగా తనతో కలిసి ఏడడుగులు నడిచిన భర్తను శాశ్వత నిద్రలోకి పంపింది ఓ భార్య. వేలు పట్టి లాలించిన ఆ నాన్నను చంపేందుకు అమ్మకు సహకరించారు తనయులు. ఈ ఘటన నందిపేటలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలోని  దుబ్బ ప్రాంతంలో గంధం రమేశ్(41) అనే వ్యక్తి శనివారం రాత్రి ఇంటిముందు ఆరు బయట నిద్రిస్తుండగా […]

Update: 2020-05-30 23:48 GMT

దిశ, నిజామాబాద్: జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మెడలో మూడు ముళ్లు వేసి అగ్ని సాక్షిగా తనతో కలిసి ఏడడుగులు నడిచిన భర్తను శాశ్వత నిద్రలోకి పంపింది ఓ భార్య. వేలు పట్టి లాలించిన ఆ నాన్నను చంపేందుకు అమ్మకు సహకరించారు తనయులు. ఈ ఘటన నందిపేటలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలోని దుబ్బ ప్రాంతంలో గంధం రమేశ్(41) అనే వ్యక్తి శనివారం రాత్రి ఇంటిముందు ఆరు బయట నిద్రిస్తుండగా భార్య పద్మ గొంతు నులిమి హత్య చేసింది. నాన్నను హతమార్చేందుకు ఆమెకు ఇద్దరు కొడుకులు సహకారమందించారు. ఆదివారం తెల్లవారు జామున ఈ ముగ్గురు నిందితులు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. కుటుంబ కలహాలతో రమేశ్ ను చంపినట్లు వారు వెల్లడించారు. అనంతరం పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు.

Tags:    

Similar News