కలలో రేప్ చేస్తున్నాడు.. కాపాడండి.. కేసు పెట్టిన మహిళ
దిశ, వెబ్‌డెస్క్: కొంతమంది వ్యక్తులు మాంత్రిక, తాంత్రిక విద్యలతో ప్రజలను బురిడి కొట్టించడం చాలా సార్లు విన్నాం, చూశాం. ఇక వారికి వచ్చిన గారడీ విద్యలతో గాల్లో దీపాలను లేపడం, కొబ్బరికాయలో పువ్వులు తెప్పించడం, నోట్లో నుంచి లింగాలు తీయడం ఇలాంటివన్నీ విన్నాం. కానీ, ఇక్కడ జరిగిన గారడీ మాత్రం వాటన్నింటికి భిన్నం. కాదుకాదు ఓ విచిత్రం.. ఓ విడ్డూరం. ఇంతకీ విషయమేమిటంటే.. ఒక మాంత్రికుడు తన మాంత్రిక విద్యలతో రాత్రిళ్లు కల్లోకి వచ్చి తనపై అత్యాచారం […]
దిశ, వెబ్‌డెస్క్: కొంతమంది వ్యక్తులు మాంత్రిక, తాంత్రిక విద్యలతో ప్రజలను బురిడి కొట్టించడం చాలా సార్లు విన్నాం, చూశాం. ఇక వారికి వచ్చిన గారడీ విద్యలతో గాల్లో దీపాలను లేపడం, కొబ్బరికాయలో పువ్వులు తెప్పించడం, నోట్లో నుంచి లింగాలు తీయడం ఇలాంటివన్నీ విన్నాం. కానీ, ఇక్కడ జరిగిన గారడీ మాత్రం వాటన్నింటికి భిన్నం. కాదుకాదు ఓ విచిత్రం.. ఓ విడ్డూరం. ఇంతకీ విషయమేమిటంటే.. ఒక మాంత్రికుడు తన మాంత్రిక విద్యలతో రాత్రిళ్లు కల్లోకి వచ్చి తనపై అత్యాచారం చేస్తున్నాడంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నమ్మడానికి కొంచెం వింతగా ఉన్న ఈ ఘటన బీహార్ లో వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే..
ఔరంగాబాద్ జిల్లా, కుద్వ పోలీస్ స్టేషన్ పరిథిలోని గాంధీ మైదాన్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ మహిళ తన కుమారుడితో నివాసముంటుంది. అయితే ఆమె కుమారుడు గత కొన్నినెలల క్రితం జబ్బు పడ్డాడు. అన్ని హాస్పిటళ్లు తిరిగిన ఆమె చివరికి గత జనవరి నెలలో ప్రశాంత్ చతుర్వేది అనే మాంత్రికుడిని ఆశ్రయించింది. దీంతో మాంత్రికుడు ఆమె కుమారుడి ఆరోగ్యం కోసం ఏవేవో పూజలు చేశాడు. అయితే 15 రోజుల తర్వాత బాలుడు మృతిచెందాడు. ఇక కుమారుడు మృతిని తట్టుకోలేని ఆమె మాంత్రికుడు వద్దకు వెళ్లి గొడవకు దిగింది. తాను చెప్పినట్లు అన్ని చేసినా తన కుమారుడు ఎందుకు చనిపోయాడని నిలదీసింది.
ఇక ఇదే అదునుగా భావించిన మాంత్రికుడు ఆమెపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించగా చనిపోయిన బాలుడు మాంత్రికుడు చెర నుండి తనని కాపాడాడని మహిళ తెలిపింది. ఆ కోపంతో మాంత్రికుడు ఏవేవో తాంత్రిక విద్యలు ఉపయోగించి ప్రతి రోజు తన కలలోకి వచ్చి తనపై అత్యచారం చేస్తున్నాడని, అతనినునుంచి తనను కాపాడాలని ఫిర్యాదులో తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ విషయమై ప్రశాంత్‌ను విచారించగా ఆమె చెప్పేదంతా అబద్ధమని కొట్టిపాడేశాడు. నిందితుడికి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లభించకపోవటంతో పోలీసులు బాండ్‌పై సంతకం చేయించుకుని వదిలేసినట్లు పోలీసులు తెలిపారు.