హైవేపై పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన తల్లి
దిశ, కామారెడ్డి రూరల్ : 108 వాహనంలో నేషనల్ హైవేపై ఓ మహిళ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. వివరాల్లోకి వెళ్లితే.. గాంధారి మండలం జువ్వాడి గ్రామానికి చెందిన గైని రవళికి పురిటి నొప్పులు రావడంతో 108 అంబులెన్స్‌కు ఫోను చేశారు. అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకుని రవళి (20) ని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో పురిటి నొప్పులు అధికం కావడంతో 108 వాహనాన్ని నేషనల్ హైవే రోడ్డు పక్కన మర్కల్ బస్ స్టేజ్ సమీపంలో ఆపి […]
దిశ, కామారెడ్డి రూరల్ : 108 వాహనంలో నేషనల్ హైవేపై ఓ మహిళ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. వివరాల్లోకి వెళ్లితే.. గాంధారి మండలం జువ్వాడి గ్రామానికి చెందిన గైని రవళికి పురిటి నొప్పులు రావడంతో 108 అంబులెన్స్‌కు ఫోను చేశారు. అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకుని రవళి (20) ని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో పురిటి నొప్పులు అధికం కావడంతో 108 వాహనాన్ని నేషనల్ హైవే రోడ్డు పక్కన మర్కల్ బస్ స్టేజ్ సమీపంలో ఆపి ఆమెకు అంబులెన్స్‌లోనే సుఖ ప్రసవం చేశారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో 108 అంబులెన్స్ సిబ్బంది చాలా చాక చక్యంగా సాధారణ ప్రసవం చేసి తల్లి, బిడ్డలను కాపాడారు. మొదటి కాన్పులోనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డలు క్షేమం గా ఉన్నారని, తదుపరి వైద్యసేవల నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించినట్లు 108 సిబ్బంది తెలిపారు. సరైన సమయంలో వైద్య సేవలు అందించి, తల్లి బిడ్డ లను కాపాడిన 108 అంబులెన్సు సిబ్బంది అంజయ్య, పైలట్ రామశంకర్‌లను ఆమె భర్త బాలకృష్ణ, జువ్వాడి గ్రామస్తులు అభినందించారు.