కొనుగోలు కేంద్రాల్లో రైతులకు సౌకర్యాలు కల్పించాలి
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులకు గురి కాకుండా సకల సౌకర్యాలు కల్పించాలని నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ సూచించారు.
దిశ, ఆర్మూర్ :వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులకు గురి కాకుండా సకల సౌకర్యాలు కల్పించాలని నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ సూచించారు. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రం పరిధిలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వరి కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దిగుబడులను అమ్ముకునేందుకు వచ్చిన రైతులకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని కొనుగోలు కేంద్రాల్లోనే వరి ధాన్యం దిగుబడులను అమ్ముకొని మద్దతు ధరను పొందలన్నారు. కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసు కోవాలని సూచించారు. జిల్లా అదనపు కలెక్టర్ వెంట ఆర్మూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, పెర్కిట్ సొసైటీ చైర్మన్ పెంట బోజారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అజ్జు బాయ్, సొసైటీల అధికారులు, సిబ్బంది, రైతులు ఉన్నారు.