ప్రభుత్వ భూములపై అధికారుల నిర్లక్ష్యం తగదు..
ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్న వారిపై ఆర్మూర్ లోని అధికారుల నిర్లక్ష్యం తగదని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు.
దిశ, ఆర్మూర్ : ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్న వారిపై ఆర్మూర్ లోని అధికారుల నిర్లక్ష్యం తగదని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని జర్నలిస్ట్ కాలనీలో కబ్జాకు గురైన అసైన్మెంట్ భూమిని శనివారం ఆర్మూర్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్మూర్ ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ భూముల భద్రతకు అధికారులు చొరవ తీసుకోవాలని, నిర్లక్ష్యాన్ని విడాలని ఆదేశించారు. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే..ఊరుకునేది లేదని, కబ్జాదారులకు సహకరించి అధికారులపై ఆర్మూర్ ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ తాసిల్దార్ గజనాన్, ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు, ఆర్మూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ కంచెట్టి గంగాధర్, ఆర్మూర్ బిజెపి అసెంబ్లీ కన్వీనర్ పాలెపు రాజు రెడ్డి, బిజెపి నాయకులు ఆకుల శ్రీనివాస్ , జెస్సు అనిల్ కుమార్, దుగ్గి విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.