భర్త సాయంతో ప్రియుడి హత్య
దిశ, కోదాడ: సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం శాంతినగర్ గ్రామ శివారులో మూడ్రోజుల క్రితం జరిగిన హత్య కేసును కోదాడ రూరల్ పోలీసులు చేధించారు. అక్రమ సంబంధం నేపథ్యంలో తన భర్తతో కలిసి ఓ మహిళ తన ప్రియుడిని హతమార్చిన ఈ సంఘటనలో కోదాడ రూరల్‌పోలీసులు భార్యా, భర్తలు ఇరువురిని అరెస్ట్ చేశారు. కోదాడ డీఎస్పీ మోహన్ కుమార్ వివరాల ప్రకారం.. తమిళనాడుకు చెందిన వెన్ని రంగనాథ్(43) అనే వ్యక్తి చిన్నతనంలోనే కుటుంబంతో సహా వచ్చి ఖమ్మంలో […]
దిశ, కోదాడ: సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం శాంతినగర్ గ్రామ శివారులో మూడ్రోజుల క్రితం జరిగిన హత్య కేసును కోదాడ రూరల్ పోలీసులు చేధించారు. అక్రమ సంబంధం నేపథ్యంలో తన భర్తతో కలిసి ఓ మహిళ తన ప్రియుడిని హతమార్చిన ఈ సంఘటనలో కోదాడ రూరల్‌పోలీసులు భార్యా, భర్తలు ఇరువురిని అరెస్ట్ చేశారు. కోదాడ డీఎస్పీ మోహన్ కుమార్ వివరాల ప్రకారం..
తమిళనాడుకు చెందిన వెన్ని రంగనాథ్(43) అనే వ్యక్తి చిన్నతనంలోనే కుటుంబంతో సహా వచ్చి ఖమ్మంలో స్థిరపడ్డాడు. ఉపాధి కోసం ఖమ్మం పరిసర ప్రాంతంలో గ్రానైట్ వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఖమ్మంలోనే నివాసముంటున్న తన కోడలు వరసయ్యే చల్లా రాజేశ్వరితో గత ఏడేండ్లుగా వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అనంతరం చల్లా రాజేశ్వరికి, ఆమె భర్త రమేష్‌ల మధ్య గొడవలు ప్రారంభం అయ్యాయి. 15 రోజుల క్రితం ఇద్దరి మధ్య వివాదం తీవ్రతరం కావడంతో రాజేశ్వరి తన తల్లిగారి ఊరైన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కొత్త కొత్తూరు వెళ్లింది. ఉపాధి కోసం ఖమ్మంలో టైలరింగ్ నేర్చుకుంటోంది. ఈ క్రమంలో తన భార్య రంగనాథ్‌తో అక్రమ సంబంధం పెట్టుకున్న విషయం రమేశ్‌కు తెలిసింది.
దీంతో పిల్లలు పెద్ద వాళ్లు అవుతున్న సమయంలో తాము గొడవ పడటం బాగోలేదని రమేశ్ భార్య వద్దకు వెళ్లి నచ్చజెప్పాడు. అంతేగాకుండా తమ కుటుంబంలో గొడవలకు కారణమైన రంగనాథ్‌ను హతమార్చేందుకు నిర్ణయించుకున్నానని భార్యతో చెప్పాడు. దీనికి రాజేశ్వరీ అంగీకరించింది. ఈ నేపథ్యంలో భార్యభర్తలిద్దరూ రంగనాథ్‌ను హతమార్చేందుకు కుట్ర పన్నారు. ప్లాన్ ప్రకారం ఈనెల 22వ తేదీన ఆదివారం సాయంత్రం రంగనాథ్‌ను రాజేశ్వరీ శాంతినగర్ శివారులోని గుట్టల వద్దకు తీసుకువచ్చింది. అనంతరం ఇరువురు మాటల్లో ఉండగా వెనుకనుంచి రమేశ్ రంగనాథ్‌పై కర్రలతో దాడి చేశాడు. పారిపోతుండగా తలపై బండరాయితో మోది హతమార్చాడు. అయితే ఈ ఘటనపై విచారణ చేపట్టిన కోదాడ రూరల్ సీఐ శివరాంరెడ్డి భార్యభర్తలిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించగా తామే హత్యకు పాల్పడినట్లు అంగీకరించారు. దీంతో వారిని అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా కేసును రెండ్రోజుల్లోనే చేధించిన కోదాడ రూరల్ సీఐ శివరాంరెడ్డి, రూరల్‌ఎస్‌ఐ సైదులుగౌడ్, చిలుకూరు ఎస్ఐ నాగభూషణ్ రావు, పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ భాస్కరన్ అభినంధించారు.